- ఫైనాన్స్, టెక్నాలజీ రంగాల్లో అనుభవం..
- బ్యాంకింగ్ లో వచ్చే మార్పులకు అనుగుణంగా సేవలు..
అమెరికాలో అతిపెద్ద ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూట్ సంస్థల్లో ఒకటైన సిటీజన్స్ ఫైనాన్షియల్ గ్రూపు అనుబంధ సంస్థయైన సిటిజెన్ ఫైనాన్షియల్ గ్రూపు ఇండియా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా రాజేశ్ మణి నియమితులయ్యారు. ఆర్థికసేవలు, టెక్నాలజీ విభాగాల్లో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న రాజేశ్..గ్లోబల్ టెక్నాలజీ ఆర్గనైజేషన్‌లో ఉన్నతాధికారిగా సేవలు అందించారు. ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ..సీఎఫ్‌జీ ఇండియాలో చేరడం చాలా సంతోషంగా ఉన్నదని, బ్యాంకింగ్ లో వచ్చే మార్పులకు అనుగుణంగా టెక్నాలజీ సేవలను అందించాల్సివుంటుందన్నారు.
- Advertisement -
