- ఆగస్టు 1న కార్యాచరణ ప్రారంభిస్తాం
- ఉమ్మడి పాలమూరు జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం కార్యక్రమం – ఆగస్టు 1
ఉమ్మడి పాలమూరు జిల్లాలో జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో, ఆ పార్టీ నాయకులు రామకృష్ణ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ పట్టణంలో ఒక ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆగస్టు 1వ తేదీన ఉమ్మడి మహబూబ్నగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ శ్రీ మెడ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నాము.
ఈ కార్యక్రమానికి జనసేన పార్టీకి చెందిన రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల పార్టీ ముఖ్య నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.
కార్యక్రమంలో భాగంగా మహబూబ్నగర్ పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులర్పించి అనంతరం, అక్కడి నుంచి భారీ ర్యాలీ నిర్వహించబడుతుంది. ఈ ర్యాలీ ద్వారా పాలమూరు జిల్లాలో జనసేన పార్టీ తన ఉనికిని, ప్రజా బలం మరియు సేవా సంకల్పాన్ని ప్రజలకు చాటుతూ ముందుకు సాగనుంది.
కార్యక్రమంలో పార్లమెంట్ ఇంచార్జి మేడ రామకృష్ణ, వంగా లక్ష్మణ్ గౌడ్, పి ఆర్ రాఘవేందర్,ముకురాల కృష్ణ, మణికంఠ గౌడ్, రవీందర్ గౌడ్, శ్రీవాళ్లి, భరధ్వాజ్, బాబు జాగ్జీవన్ (మైక్ ),డాక్టర్ వి వి చారి, ముత్యాల గౌరవ్,ఎద్దుల శ్రీనివాసులు, మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థులు,బాల్ రాజ్ యాదవ్, రవీందర్, కనక దుర్గ, నరేష్,రవి,రామ రాజు,కిషోర్ లాల్,శివ,జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు..
