తమ దగ్గర చదవని విద్యార్థిని ఇక్కడివాడే అంటూ మోసం..
నారాయణ విద్యాసంస్థల ప్రకటనలపై వెల్లువెత్తుతున్న సందేహాలు
- విద్యార్థులను, విద్యాసంస్థలను కొనేస్తున్న నారాయణ..!
- నీట్ టాపర్పై నారాయణ ప్రచారం వివాదాస్పదం
- ఆధారాలు విడుదల చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్
- మంత్రి నారాయణ రాజీనామా చేయాలని డిమాండ్
- తల్లిదండ్రులను దాగాచేస్తూ, విద్యా వ్యాపారం నేరం..
ఎడ్యుకేషన్ స్కైర్, లుథియానాలో నీట్ కోచింగ్ తీసుకున్న ఆర్యన్ గుప్తా.. ఇంటర్మీడియట్ను లూధియానాలోని శాక్రెడ్ హార్ట్ కాన్వెంట్ స్కూల్లో పూర్తి.. ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఆర్యన్ గుప్తాను తమ స్టూడెంట్ అని చెప్పుకున్న నారాయణ.. బాధ్యతగల మంత్రి స్థానంలో ఉన్న ఓ నాయకుడు ఇలా చేయడం న్యాయమా..? రాత్రికి రాత్రే ఇతర రాష్ట్రంలోని కోచింగ్ సెంటర్ను ఎలా కొనగలిగారు..? అసలు ఈ వ్యవహారంలో ఏమి జరిగింది..? వ్యవస్థలు ఏమైపోయాయి..? ఇరు తెలుగు రాష్ట్రాల విద్యా వ్యవస్థను అభాసుపాలు చేయడమే ధ్యేయమా..? మంత్రి నారాయణ చేస్తున్న ఆగడాలకు చెక్ పెట్టే వారు లేరా..?
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిరాష్ట్రంగా వున్నప్పుడు ఒక దారుణమైన సంఘటన జరిగింది.. ఒక ప్రభుత్వ కాలేజీలో చదివిన విద్యార్థి ఇంటర్ మొదటి సంవత్సరంలో స్టేట్ ఫస్ట్ వచ్చాడు.. అప్పుడు ఒక ప్రైవేట్ విద్యాసంస్థ ఆ విద్యార్థిని కొనేయడానికి ప్రయత్నించింది.. దానికి ఆ విద్యార్థి ససేమిరా అన్నాడు.. దానికి అతనిపై కక్ష పెంచుకున్న ఆ ప్రైవేట్ విద్యాసంస్థ ఇంటర్ మీడియేట్ రెండవ సంవత్సరం ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నప్పుడు.. అతడిని అడ్డుకోవడం జరిగింది.. అతని తల్లిదండ్రులను బెదిరించి ఇప్పుడు మా కాలేజీ తరఫున పరీక్షలు రాయకపోతే మిమ్మల్ని మట్టుపెడతాం.. ఇంట్లోనే కూర్చోమని వార్నింగ్ ఇచ్చారు..

ఈ సంఘటనతో క్షోభ చెందిన ఆ అమాయక, ఇంటెలిజెంట్ విద్యార్థి ఆత్మాహుతి చేసుకోవడం జరిగింది.. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. ఇప్పుడు మంత్రి నారాయణ, ఆయన సన్నిహితులకు సంబంధించిన నారాయణ విద్యా సంస్థ ఇతర రాష్ట్రంలో ఇతర కాలేజీలో చదివి, వేరే కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకుని నీట్ యూజీ 2026 లో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థిని తమ విద్యాసంస్థలో చదివినట్లు.. ఆ విద్యార్థి కోచింగ్ తీసుకున్న సెంటర్ తమకు సంబంధించింది అంటూ మోసపూరిత ప్రకటనలు ఇస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు..
ఇక్కడో అనుమానం తలెత్తుతోంది.. నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం ఆ విద్యార్థిని, కోచింగ్ తీసుకున్న ఇనిస్టిట్యూట్ యాజమాన్యాన్ని కొనేసిందా..? లేక బెదిరించిందా..? రాత్రికి రాత్రే ఆ కోచింగ్ సెంటర్ ని తమదిగా ఎలా చెప్పుకుంటున్నారు..? అసలు దీని వెనుక జరిగిన కుతంత్రం ఏమిటి అన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది.. కళ్ళు చెదిరే వాస్తవాలను మీముందుకు తీసుకుని రావడానికి ప్రయత్నిస్తోంది ఆదాబ్ హైదరాబాద్.. ఇది వరకే నారాయణ చేసిన అకృత్యాలను ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకుని వచ్చింది ఆదాబ్..
విద్యావ్యవస్థలో జరుగుతున్న అకృత్యాలు, అమానుష సంఘటనలు చూస్తుంటే గుండె మండిపోతోంది.. చదువు అన్నది ఒక విద్యార్థికి దిక్సూచి అన్నది వాస్తవం.. కానీ ఆ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ అక్రమార్జనతో ముందుకు సాగుతున్న నారాయణ చేసిన మరో వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. విద్యావ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది..

ఎన్.డీ.ఏ. ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రికి సంబంధించిన నారాయణ విద్యాసంస్థకు విద్యార్థి సంఘాల నాయకులు సూటిగా ఒక ప్రశ్నను సంధిస్తున్నారు.. అల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థి మీ విద్యార్థి కాకపోయినా “మా స్టూడెంట” అని ఎందుకు సమాజాన్ని, ఏకంగా ఈ దేశాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు..? నారాయణ విద్యాసంస్థలు చేస్తున్న విషప్రచారాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు.. విద్యను సేవగా కాకుండా రాజకీయ పలుకుబడితో నడిచే మార్కెటింగ్ సామ్రాజ్యంగా మార్చారా? అని అడుగుతున్నారు..
దేశవ్యాప్తంగా నీట్ – యూజీ 2026 ఫలితాల నేపథ్యంలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఆర్యన్ గుప్తాను తమ విద్యార్థిగా ప్రచారం చేస్తూ నారాయణ విద్యాసంస్థలు ఇస్తున్న ప్రకటనలు తీవ్రమైన అనుమానాలకు తావిస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఎందుకంటే ఆర్యన్ గుప్తా సామాజిక మాధ్యమాలలో, మీడియా ముఖంగా తన ఫస్ట్ ర్యాంకు గురించి ఆనందంగా భావోద్వేగంతో చెప్పడం జరిగింది.. ఇకపోతే…. ఆర్యన్ గుప్తా తన ఇంటర్మీడియట్ను లూధియానాలోని శాక్రెడ్ హార్ట్ కాన్వెంట్ స్కూల్ లో పూర్తి చేసి, ఎడ్యుకేషన్ స్కైర్, లుథియానాలో నీట్ కోచింగ్ తీసుకున్నాడు..
అయితే దురదృష్టం ఏమిటంటే, అలాంటి విద్యార్థిని రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నారాయణ విద్యాసంస్థ త స్టూడెంట్ గా ప్రచారం చేయడానికి ఆధారం ఏమిటి? ఒకవైపు దేశంలో నీట్ పరీక్షల పారదర్శకత, పేపర్ లీకేజీలపై తీవ్రమైన ఆందోళనలు, చర్చలు జరుగుతున్న సమయంలో, యువత మొత్తం అసహనానికిలోనై రగిలిపోతున్న ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ అధికార కూటమిలో భాగస్వామి గా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రికి చెందిన విద్యాసంస్థపై ఇలాంటి ప్రచారం రావడం మరింత తీవ్రమైన ప్రజాప్రశ్నగా మారింది.
విద్యార్థి మీ వద్ద చదవకపోతే, అతని విజయాన్ని మీ విజయంగా ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారు..? ఇది విద్యారంగమా? లేక కార్పొరేట్ మార్కెటింగ్ రాజకీయ అండతో నడిచే ప్రచారయంత్రమా? ఇతరుల విజయాలను తమ విజయాలుగా చూపించి అడ్మిషన్లు పొందడం సిగ్గులేని చర్య. సత్తా ఉంటే తమ దగ్గర చదివిన పిల్లలతో ర్యాంకులు కొట్టించి చూపించాలి.. అంతేకానీ పాత కాలంలో ఒక సామెత ఉంది “ఇతరుల పిల్లలను తన పిల్లలుగా చెప్పుకోవడం.”
కాగా నీట్ యూజీ 2026 పరీక్షల్లో జరిగిన వ్యవహారంపై దేశం మొత్తం అట్టుడికిపోతోంది.. కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా ప్రధాన నాయకులందరూ మంగళవారం రోజు ప్రధాని మోడీ ఇంటి ముందు నిరసన తెలియజేయడం జరిగింది.. ఈ క్రమంలో వారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రథాన్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేయడం.. వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్.డీ.ఏ. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారం చెలాయిస్తున్న ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అడ్డగోలుగా మోసం చేస్తున్న మంత్రి నారాయణ కూడా తన పదవికి రాజీనామా చెయ్యాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు..
ఇప్పుడు నారాయణ చేస్తున్న ఈ ప్రచారాన్ని చూస్తే.. అదే ప్రశ్న ప్రజల్లోనుంచి వినిపిస్తోంది. మీతో సంబంధం లేని విద్యార్థిని “మా విద్యార్థి” అని చెప్పడం, మీ వ్యాపార దందా కోసం, ఇంతగా దిగజారి తల్లిదండ్రులను ఆశపెట్టి డబ్బులు దండు కుం టారా? నారాయణ విద్యాసంస్థలు నిజంగా తమ వాదనపై నమ్మ కం ఉంటే, ప్రజల ముందు ఈ వివరాలు విడుదల చేయాలి:
- ఆర్యన్ గుప్తా అడ్మిషన్ వివరాలు.
- ఏ బ్రాంచ్లో చదివాడు?
- ఏ సంవత్సరంలో నారాయణ సంస్థలో చదివాడు..?
- మీ వద్ద చదివినట్లు అధికారిక ఆధారాలు ఏమిటి?
ఒకవేళ ఆధారాలు లేకపోతే, దేశవ్యాప్తంగా ఇచ్చిన ఈ ప్రకటనలను వెంటనే ఉపసంహరించుకొని తల్లిదండ్రులకు బహిరంగ వివరణ ఇవ్వాలి. క్షమాపణలు చెప్పాలి.. విద్యను రాజకీయ పలుకుబడితో కలిపి, ర్యాంకులను మార్కెటింగ్ సాధనంగా ఉపయోగించి, లక్షలాది తల్లిదండ్రుల ఆశలను వ్యాపార అవకాశంగా మార్చే సంస్కృతిని సమాజం ప్రశ్నించాలి..
తల్లిదండ్రులకు విజ్ఞప్తి
భారీ హోర్డింగులు, అల్ ఇండియా ర్యాంకుల ప్రకటనలు, ఆకర్షణీయమైన బ్రోచర్లు చూసి మోసపోవద్దు. ఆ ర్యాంకర్ నిజంగా ఆ సంస్థ విద్యార్థేనా? అక్కడే చదివాడా? అక్కడే పూర్తి కోచింగ్ తీసుకున్నాడా? అనే విషయాలను నిర్ధారించుకున్న తర్వాతే అడ్మిషన్ నిర్ణయం తీసుకోండి. అంతేగానీ మీ పిల్లలు ఎదో సాధిస్తారు.. ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు.. ఉన్నత స్థానంలో ఉంటాడు అని అని ఆశలు పెంచుకుని రెక్కలు ముక్కలు చేసుకుని, తినే తినక కష్టపడి సంపాదించిన డబ్బులను ఇలాంటి దుర్మార్గుల చేతిలో పోసి, ఆ తర్వాత విచారించకండి.. మానసికంగా కృంగిపోకండి.. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ పిల్లలు బాగుంటారు..
వారి జీవితం బావుంటుంది, వారి భవి ష్యత్ బావుంటుంది.. దయచేసి ఒక్కసారి ఆలోచించి, నిజా నిజాలు నిర్ధారించుకుని మంచి నిర్ణయం తీసుకోండి.. అలాగే నారాయణ విద్యాసంస్థలపై విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి అక్షపోరాటం చేస్తామని ఆదాబ్ హెచ్చరిస్తోంది.. నారాయణ చేస్తున్న మోసాలపై సరైన ఆధారాలతో మరిన్ని కథనాలను వెలుగులోకి తీసుకుని రావడానికి సిద్ధంగా ఉంది
