Homeఆదిలాబాద్Bellampalli | సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన బెల్లంపల్లి చైర్ పర్సన్

Bellampalli | సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన బెల్లంపల్లి చైర్ పర్సన్

  • బెల్లంపల్లి చైర్ పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శాసనసభ్యులు, గౌర గడ్డం వినోద్ సతీమణి రమాదేవి ఆయన కుమార్తె వర్ష దంపతులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి బెల్లంపల్లి పట్టణ సమస్యలు, పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి నిధుల మంజూరు విషయమై వినతిపత్రం అందజేసిన బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి-రమేష్ బాబు బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం ఉన్న సమస్యలను, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సమగ్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వివరించడం జరిగింది..

పట్టణంలోని ప్రధాన, అంతర్గత రోడ్ల విస్తరణ మరియు మురుగు కాలువల నిర్మాణం మరియు పాత డ్రైనేజ్ వ్యవస్థ పునరుద్ధరణ కోసం వివరించడం జరిగింది.. పట్టణంలోని 34 వార్డ్ లలో మౌలిక వసతుల అభివృద్ధి అలాగే, బెల్లంపల్లి పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరడం జరిగింది.

- Advertisement -

పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన అధునాతన వైద్య పరికరాలు, వైద్య నిపుణులను, సరిపడా సిబ్బందిని నియమించాలని కోరారు బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి ప్రాంతంలో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న వారికి 76- జీఓ ప్రకారం ఇళ్ల పట్టాలు ఇచ్చేలా చూడాలని కోరడం జరిగింది.. బెల్లంపల్లి స్థానిక యువతకు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించేందు గాను బెల్లంపల్లి పట్టణంలో అంబేద్కర్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News