Homeకరీంనగర్Sand Quarry | ఇసుక క్వారీపై ప్రజల ఆందోళన

Sand Quarry | ఇసుక క్వారీపై ప్రజల ఆందోళన

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఖాజీపూర్ గ్రామ పరిధిలో నిర్వహిస్తున్న ఇసుక క్వారీ స్థానికంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.ఇసుక తవ్వకాల పర్యావరణ సమస్యలతో పాటు భూగర్భ జలాలు తగ్గిపోయి, సాగు, తాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోన్ అవ్వడమే కాకుండా పంట పొలాలు ఎండిపోతున్నాయని గ్రామస్తులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఖాజీపూర్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇసుక క్వారీలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ స్థానికులు, సర్పంచ్‌లు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టారు వీరికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మద్దతు తెలిపారు మానేరు డ్యామ్‌లో పూడికతీత పేరుతో నిబంధనలకు విరుద్ధంగా పరిధిని మించి మానేరు వాగులో ఇసుకను తవ్వి తరలిస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు పర్యావరణం దెబ్బతింటున్నదని విమర్శిస్తున్నారు.

- Advertisement -
khazipur sand quarry protest karimnagar1

ఇసుక క్వారీని వెంటనే నిలిపివేయాలి .
ఖాజీపూర్ సర్పంచ్ కోమటిరెడ్డి అంజనీ కుమార్

ఎల్ఎండి ,మిడ్ మానేర్ పూడికతీత టెండర్ తీసుకొని అక్రమంగా వాగులో ఇసుక తొడుతూ తరలిస్తున్నారు వీరికి అధికారుల అండదండలు దండిగా ఉన్నాయనే ధీమా తో దందా కొనసాగిస్తున్నారు, అక్రమంగా ఇసుకను పెద్ద ఎత్తున తోడటం వల్ల భూగర్భ జలాలు అంతరించి సాగునీటి, తాగునీటి, సమస్యలు ఏర్పడి పంటలు ఎండిపోతున్నాయి, బావులలో నీరు పూర్తిగా అడుగంటింది… కావున వెంటనే అక్రమంగా చేపట్టిన ఇసుక క్వారీని నిలిపివేయాలని ప్రజల సహకారంతో నిరసన కార్యక్రమాలు చేపట్టామని అక్రమ కారుని ఆపకుంటే భవిష్యత్తులో నిరసన ఆందోళన కార్యక్రమాలు మరింత ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం

khazipur sand quarry protest karimnagar

కోమటి రెడ్డి అంజనీ కుమార్,

- Advertisement -
RELATED ARTICLES

Latest News