Homeహైదరాబాద్‌Chilkalguda Police | వృద్ధురాలికి ఆశ్రయం కల్పించిన చిలకలగూడ పోలీసులు

Chilkalguda Police | వృద్ధురాలికి ఆశ్రయం కల్పించిన చిలకలగూడ పోలీసులు

  • గాంధీ ఆసుపత్రి వద్ద మానవత్వం చాటుకున్న ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ
  • మానవత్వం చాటుకున్న చిలకలగూడ పోలీసులను అభినందించిన రోగులు సహాయకులు

గాంధీ ఆసుపత్రి వెయిటింగ్ హాల్ వద్ద ఒంటరిగా దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలికి చిలకలగూడ పోలీసులు అండగా నిలిచారు. విధినిర్వహణలో భాగంగా అక్కడికి వచ్చిన ఇన్‌స్పెక్టర్ వలిశెట్టి రామకృష్ణ వృద్ధురాలిని గమనించి వివరాలు తెలుసుకున్నారు. ఆమె పేరు కుందన్ భాయ్ (68) అని,చూసుకునే వారు ఎవరూ లేరని గుర్తించారు.వెంటనే హెడ్ కానిస్టేబుల్ పూస శ్రీనివాస్‌కు సూచనలు ఇచ్చి, బోయిగూడలోని మిషనరీస్ ఆఫ్ చారిటీ హోమ్‌కు తరలించి ఆశ్రయం కల్పించారు. వృద్ధురాలికి సకాలంలో సహాయం చేసిన ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌లను గాంధీ ఆసుపత్రి రోగులు, సహాయకులు, స్థానికులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News