HomeసినిమాMaa Inti Bangaaram | 100 కోట్ల క్లబ్‌లోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ 

Maa Inti Bangaaram | 100 కోట్ల క్లబ్‌లోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ 

రీసెంట్‌గా సమంత ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ రిలీజై సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ‘మా ఇంటి బంగారం’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అధికారికంగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటి.. భారతీయ సినిమా చరిత్రలోనే రూపొందిన మహిళా ప్రధాన చిత్రాల్లో అతిపెద్ద కమర్షియల్ విజయాల్లో ఒకటిగా తన స్థానాన్ని మరింత బలపరచుకుంది. ఈ చిత్రం తన బడ్జెట్‌పై 300 శాతం పైగా రికవరీ సాధించడం విశేషం.

తెలుగు లో ఇప్పటివరకు వచ్చిన మహిళా ప్రధాన సినిమాల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది నిలిచింది. తాజాగా మా ఇంటి బంగారం సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అధికారికంగా రూ.100 కోట్ల మార్క్ దాటి అరుదైన రికార్డ్‌ను క్రియేట్ చేసింది. తన ప్రయాణంలో ఎన్నో కలెక్షన్ రికార్డులను బ్రేక్ చేస్తూ.. మహిళా ప్రధాన సినిమాల్లోనే $2.5 మిలియ‌న్స్ డాల‌ర్స్ క‌లెక్ష‌న్స్‌తో అత్యధిక ఓవర్సీస్ వసూళ్లు సాధించిన చిత్రంగానూ నిలిచింది. అంతేకాకుండా భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సోలో మహిళా ప్రధాన చిత్రాల్లో మా ఇంటి బంగారం 6వ స్థానాన్ని దక్కించుకుంది.

- Advertisement -

‘మా ఇంటి బంగారం’ చిత్రానికి రాజ్ కె నిడిమోరు ఆలోచ‌న‌  ప్రధాన బలం. ఆయన డైరెక్ట‌ర్ బీవీ నందిని రెడ్డితో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. రాజ్, సమంత, హిమాంక్‌ రెడ్డి దువ్వూరు క‌లిసి స్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా 2026 జూన్ 19న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైంది. తమిళంలో ఎంగళ్ తంగం పేరుతో రిలీజైంది. గుల్షన్ దేవయ్య, దిగంత్, గౌతమి, శ్రీముఖి, ఆనంద్ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

maa inti bangaaram crosses 100 crore1

ఈ చిత్రం ఓ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అరుదైన రీతిలో అన్ని వయస్సుల మహిళలు, ప్రేక్ష‌కులు థియేటర్లకు తరలివచ్చి ఈ సినిమాను బ్లాక్ బ‌స్ట‌ర్ చేశారు. సమంత నటనతో పాటు, పర్ఫెక్ట్‌గా సెట్ అయిన నటీనటుల, సాంకేతిక నిపుణుల ప‌నితీరుపై ఆడియెన్స్ ప్రశంసలు కురిపించారు. అలాగే ఈ చిత్రం సిట్యుయేషనల్ కామెడీతో పాటు సహజంగా కనిపించే అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలకు కూడా ప్రత్యేక ప్రశంసలను అందుకుంది.

“ఇది మాకు కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు!” అని సమంత అన్నారు. “మా ఇంటి బంగారం సినిమా ద్వారా భాషతో సంబంధం లేకుండా, పూర్తిగా మహిళా ప్రధానంగా నడిచే కథలను ప్రేక్షకులు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని మరోసారి ప్రూవ్ అయ్యింది” అన్నారు. క్రియేటర్, ప్రొడ్యూసర్ రాజ్ నిడిమోరు మాట్లాడుతూ “చివరికి నేను ఒక తెలుగు సినిమా చేశాను. ఈ సినిమాకు ప్రేక్షకులు చూపించిన ప్రేమ, ఆదరణ చూసి ఆనందంలో మునిగిపోయాను. ఈ సినిమాను తమదిగా స్వీకరించిన ప్రేక్షకులందరికీ  హృదయపూర్వక కృతజ్ఞతలు” అన్నారు.

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌కు చెందిన నిర్మాత హిమాంక్‌ మాట్లాడుతూ “మహిళా ప్రధాన చిత్రం రూ.100 కోట్ల వసూళ్లు సాధించడం పరిశ్రమకు ఒక మైలురాయి. మా ఇంటి బంగారం అనౌన్స్‌మెంట్‌ నుంచి విడుదల వరకు ప్రతి దశలోనూ పరిశ్రమకు ఒక కేస్ స్టడీగా నిలిచే చిత్రం అవుతుంది” అన్నారు.

‘మా ఇంటి బంగారం’ సినిమా ఇక్క‌డే కాకుండా ఓవ‌ర్సీస్‌లోనూ స‌క్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్‌ను కొనసాగిస్తోంది.

‘మా ఇంటి బంగారం’ గురించి…

2026లో విడుదలైన ఈ తెలుగు యాక్షన్-కామెడీ ఫ్యామిలీ డ్రామాను రాజ్ కె నిడిమోరు క్రియేట్ చేశారు. వసంత్ మారింగంటి, రాజ్ కలిసి కథను అందించగా.. సీతా ఆర్ మీనన్ క్రియేటివ్ సూపర్ విజన్ అందించారు. బీవీ నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ధర్మేంద్ర కాకరాల ఎడిటర్‌. రాజ్, సమంత, హిమాంక్‌ కలిసి ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. 2026 జూన్ 19న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైంది. సమంత ప్రధాన పాత్రలో నటించగా, గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి, శ్రీముఖి, ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News