Homeరంగారెడ్డిAppointment | మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ కి ఛాన్స్..

Appointment | మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ కి ఛాన్స్..

  • చంద్రపురి కాలనీ డివిజన్ అధ్యక్షుడిగా నియామకం..
  • నియామక పత్రం అందించిన మహేష్ కుమార్ గౌడ్.

చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లెపూల శ్రీకాంత్ యాదవ్‌ను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నియమించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ నియామక పత్రాన్ని శ్రీకాంత్ యాదవ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా పనిచేయాలని సూచించారు.

మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ తనపై మరోసారి నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News