Saturday, June 27, 2026
HomeజాతీయంMDMK | తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం..

MDMK | తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం..

  • విడిపోయిన డీఎంకే, ఎండీఎంకే. బంధం..
  • విజయ్ తో జతకట్టనున్న ఎండీఎంకే.. !

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తొమ్మిదేళ్లుగా డీఎంకేతో కొనసాగుతున్న బంధాన్ని ఎండీఎంకే అధికారికంగా తెంచుకుంది. నేడు జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే, టీవీకే నేతృత్వంలోని కూటమిలో చేరుతున్నట్లు స్పష్టమైన ప్రకటన చేయనప్పటికీ, ఆ దిశగానే సంకేతాలు ఇచ్చింది.

ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఎండీఎంకే తీర్మానాలు చేసింది. అవినీతి రహిత పాలన, మేఘదాతు డ్యామ్ వంటి అంశాల్లో తమిళనాడు హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం రాజీలేని వైఖరిని కొనసాగించాలని కోరింది. టీవీకే కూటమిలో చేరికపై ప్రత్యక్ష ప్రస్తావన లేనప్పటికీ, ఇటీవలి పరిణామాలు ఆ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి.

- Advertisement -

డీఎంకే కూటమిలో కొనసాగలేని పరిస్థితులు ఉన్నాయని ఎండీఎంకే ఆరోపించింది. “తమ పార్టీని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరిగాయని”, “ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రహస్య ప్రణాళికలు రచించారని” ఎండీఎంకే తన తీర్మానంలో ఆరోపించింది. అందుకే కూటమి నుంచి వైదొలగాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.

అయితే, ఈ ఆరోపణలను డీఎంకే ఖండించింది. “ఎండీఎంకేకు అసెంబ్లీ, పార్లమెంటులో ప్రాతినిధ్యం లభించేలా చేసింది డీఎంకేనే” అని పార్టీ నేత సయ్యద్ హఫీజుల్లా అన్నారు. “వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన వైకో, ఇప్పుడు తన కుమారుడు దురై వైకోకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడమే ఎండీఎంకే బలహీనపడటానికి కారణం” అని ఆయన విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News