- కాప్రా తహసీల్దార్ మతిన్ ఆదేశాలతో కూల్చివేతలు
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్లు 497, 211లో ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమంగా కమర్షియల్ షట్టర్లు నిర్మిస్తున్నారనే సమాచారం అందడంతో కాప్రా తహసీల్దార్ మతిన్ ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు.
రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో అక్రమ నిర్మాణాలను తొలగించారు. వికలాంగుల కాలనీ, కార్మిక్ నగర్, బాలాజీ నగర్ ప్రాంతాలతో పాటు ప్రభుత్వ పాఠశాల సమీపంలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూడా తొలగించినట్లు అధికారులు తెలిపారు.


ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇకపై ఎవరైనా అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ స్పష్టం చేశారు.
