నగరంలోని హనుమాన్‌నగర్ లో గల బ్లూ బెల్స్ హైస్కూల్లో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని , రోడ్డు భద్రత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐ వై ఎస్ ఓ యాంటీ కరప్షన్ ,రోడ్ సేఫ్టీ డైరెక్టర్ ఘనశ్యాం ఓజా హాజరయ్యారు .
ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాలను పాటించడం, హెల్మెట్ ధరించడం, జీబ్రా క్రాసింగ్‌ను ఉపయోగించడం, వాహనాలు నడిపేటప్పుడు సెల్‌ఫోన్ వినియోగాన్ని నివారించడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్నప్పటి నుంచే ట్రాఫిక్ నియమాల పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు యోగా ప్రాముఖ్యతను తెలియజేశారు. ఉపాధ్యాయులు వివిధ యోగా ఆసనాలను ప్రదర్శించి యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు.

ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ , చైర్మన్ జంగా సునీత మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం తో పాటు ఏకాగ్రత, క్రమశిక్షణను అభివృద్ధి చేస్తుందని అన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా మన భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపద అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని యోగా , రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించుకున్నారు.
