Thursday, June 18, 2026
Homeఅంతర్జాతీయంIran | మేము దౌత్యపరమైన విజయం సాధించాం..

Iran | మేము దౌత్యపరమైన విజయం సాధించాం..

  • వెల్లడించిన ఇరాన్ అధికారులు..

ఇరాన్‌తో యుద్ధానికి ముగింపు ప‌లుకుతూ ఫ్రాన్స్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఓ ఒప్పందంపై సంత‌కం చేసిన విష‌యం తెలిసిందే. 14 పాయింట్ల డాక్యుమెంట్‌పై ట్రంప్‌తో పాటు ఇరానీ అధ్య‌క్షుడు మ‌సౌద్ పెజెష్కియాన్ డిజిట‌ల్ సంత‌కాలు చేశారు. అయితే ఆ ఒప్పందం త‌క్ష‌ణ‌మే అమ‌లులోకి వ‌చ్చిన‌ట్లు పాకిస్థానీ మీడియేట‌ర్లు వెల్ల‌డించారు. ఇక ట్రంప్ సంత‌కం చేసిన ఆ ఒప్పందంపై ఇరాన్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. అమెరికాపై తాము దౌత్య‌ప‌ర‌మైన విజ‌యాన్ని సాధించామ‌ని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు.

అమెరికా త‌న మిలిట‌రీ ల‌క్ష్యాల‌ను అందుకోలేక‌పోయింద‌ని ఆ అధికారులు ఆరోపించారు. ఇరానీ పార్ల‌మెంట‌రీ స్పీక‌ర్‌, అమెరికాతో చ‌ర్చ‌ల్లో పాల్గొన్న మొహ‌మ్మ‌ద్ ఘ‌లీబాఫ్(Mohammad Ghalibaf) మాట్లాడుతూ.. అమెరికా లొంగిపోయింద‌ని చెప్ప‌డానికి ట్రంప్ చేసిన ఒప్పంద సంత‌క‌మే సాక్ష్య‌మ‌ని తెలిపారు. ఆ అగ్రిమెంట్ అనేది అమెరికా వైఫ‌ల్యానికి ఆధారామ‌న్నారు. ఇరానీ టీవీల‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన ఘ‌లీబాఫ్ మాట్లాడుతూ.. ప్ర‌జ‌లు ఆ అగ్రిమెంట్‌ను ప‌రిశీలించి, దానిపై నిర్ణ‌యాన్ని అంచ‌నా వేస్తార‌న్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News