Friday, June 12, 2026
Homeఆంధ్రప్రదేశ్Botsa | విజయవంతంగా వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన..

Botsa | విజయవంతంగా వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన..

  • ముఖ్యఅతిధిగా హాజరైన బొత్స సత్యనారాయణ..

చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన ర్యాలీ విజయవంతం. ముఖ్య అతిథిగా శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ హాజరైయ్యారు.. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన ర్యాలీలో శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరుకాగా, మాజీ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, డాక్టర్ బొత్స అనూష, డాక్టర్ బొత్స సందీప్ పాల్గొన్నారు.

చీపురుపల్లి సిటీ కేబుల్ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ప్రారంభమైన ర్యాలీ గాంధీ సెంటర్ వరకు పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలతో చీపురుపల్లి దద్దరిల్లింది మాజీమంత్రి వర్యులు బొత్స మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన ప్రస్తుత ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ప్రజలు ఆశించిన పాలన కనిపించడం లేదు.

- Advertisement -

ధరలు పెరిగాయి, నిరుద్యోగ సమస్య అలాగే ఉంది, అభివృద్ధి పనులు మందగించాయి. ప్రజల సమస్యలను పక్కన పెట్టి ప్రచారాలకే పరిమితమవుతున్నారు. ప్రజలను మోసం చేసిన ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మా పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల తరఫున మా పోరాటం కొనసాగుతుంది అని ఆయన తెలియజేశారు.

ఎన్టీఆర్ కి బహిరంగ లేఖ విడుదల చేసిన డాక్టర్ బొత్స అనూష :

స్వర్గీయ నందమూరి తారకరామారావుకి ఆనాడు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు నాయుడు, నేడు ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో అనేక హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని, అయితే ఆ హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని, నాడు మీకు జరిగిన అన్యాయాన్ని, నేడు ప్రజలకు జరుగుతున్న వంచనను మీ విధానం సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. ప్రజల పక్షాన నిలబడి, ఈ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తామని చీపురుపల్లి పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద డాక్టర్ బొత్స అనూష, డాక్టర్ బొత్స సందీప్ నియోజకవర్గం పార్టీ శ్రేణులతో ప్రతిజ్ఞ చేశారు..

ప్రజా సమస్యలపై మేము నిరంతరం నాన్న బొత్స సత్యనారాయణ సూచనలతో ప్రజల పక్షాన పోరాడుతాం అని తెలియజేశారు..ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిశీలకులు శోభా స్వాతి రాణి, చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీ లు, జిల్లా నియోజకవర్గ, మండల వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ పథకాల బాధితులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News