- చీకట్లోనే చీర్యాల డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల జీవనం
ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి అందించినప్పటికీ, విద్యుత్ సౌకర్యం లేక చీర్యాల డబుల్ బెడ్రూమ్ కాలనీ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు ఏడాది క్రితమే ఇళ్ల పట్టాలు అందజేసినా ఇప్పటికీ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయకపోవడంతో కుటుంబాలు చీకట్లోనే జీవనం సాగిస్తున్నాయి.
స్థానిక విద్యుత్ శాఖ ఏఈ మురళిని పలుమార్లు కలిసి వినతులు ఇచ్చినా ఫలితం లేకపోయిందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో లాంతర్లు, కొవ్వొత్తుల వెలుతురులోనే కాలం గడపాల్సి వస్తోందని, పిల్లల చదువులు, కుటుంబ అవసరాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లక్షల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఇళ్లకు కనీస విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు. వెంటనే స్పందించి చీర్యాల డబుల్ బెడ్రూమ్ కాలనీలోని అన్ని ఇళ్లకు విద్యుత్ మీటర్లు మంజూరు చేసి విద్యుత్ సరఫరా అందుబాటులోకి తీసుకురావాలని లబ్ధిదారులు జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను కోరుతున్నారు.
