హీరో రాజు, తన భార్య సుహానా కలిసి తన కూతురు ఖుషి పేరు మీద తమ కలలు సహకారం చేసుకునే విధంగా మొదలుపెట్టిన ఖుషి డాన్స్ స్టూడియో ప్రారంభమై సంవత్సరం పూర్తి అయి రెండవ సంవత్సరం లో దిగ్విజయంగా కొనసాగతూన్నా ఈ సందర్భంగా కూకట్పల్లిలోని వారి డాన్స్ స్టూడియో వద్ద రెండవ వార్షికోత్సవ వేడుకలు చేసుకున్నారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా, డాన్స్ మాస్టర్, జానీ మాస్టర్, చిత్రం సీను కుతుబుల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు హాజరయ్యారు. అలాగే జబర్దస్త్ వినోద్ ఇంకా మరికొందరు సినీ సెలబ్రిటీలు, కొరియోగ్రాఫర్లు, డాన్సర్స్ పాల్గొని ఈ వేడుకను మరింత ఘనవిజయం చేశారు. ఈ సందర్భంగా తమ దగ్గర డాన్స్ నేర్చుకుంటున్న స్టూడెంట్స్ తో కొన్ని డాన్స్ ప్రోగ్రాములు చేసి తమ ప్రతిభను చాటి చెప్పకుంటూ ఆ వేడుకను మరింత కళాత్మకంగా చేశారు.
నటుడు చిత్రం శ్రీను మాట్లాడుతూ… “ఖుషి డాన్స్ స్టూడియోస్ రాజు అంటే మాకు చాలా కావాల్సిన వారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగిన కుటుంబ సమేతంగా వస్తారు. రెండవ వార్షికోత్సవం చేసుకున్నందుకు శుభాకాంక్షలు. ఇటువంటి మరెన్నో వార్షికోత్సవాలు చేసుకోవాలని కోరుకుంటున్నాను” అన్నారు.
.
ఖుషి డాన్స్ స్టూడియోస్ అధినేత, అందరికీ సుపరిచితుడు, చారితో పూరి, వైతరణి రాణ, i20 చిత్ర నటుడు రాజు మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా నమస్కారం. నాకు డాన్స్ స్టూడియో గురించి అంతగా తెలియదు. నా మిత్రుడు సురేష్ నా వెనుక ఉండి సపోర్ట్ చేయడం వల్ల అలాగే మీరంతా నాకు అండగా నిలబడటం వల్ల నేను ఈరోజు ఇంతగా ఎదుగుతున్నాను. భవిష్యత్తులో కూడా మీ అందరి సపోర్ట్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను” అన్నారు.
ఈ వేడుకల సందర్భంగా తమ దగ్గర డాన్స్ నేర్చుకున్న పిల్లలు డాన్స్ పెర్ఫార్మన్స్ చేసి తమ ప్రతిభను చూపించారు. అలాగే ఈ వేడుకకు హాజరైన వారందరికీ చిరు సత్కారంతో గౌరవించరు.
