- ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ప్రస్తుతం యూరాలజీ విభాగంలో ప్రొఫెసర్ గా బాధ్యతలు..
- మూడు సంవత్సరాలు కొనసాగనున్న పదవీ కాలం..
హైదరాబాద్ పంజాగుట్టలో నెలకొని రోగులకు విశిష్ట సేవలందిస్తూ దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించిన నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( నిమ్స్ ) ఆసుపత్రి కొత్త డైరెక్టర్ గా డాక్టర్ రాహుల్ దేవరాజ్ ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.. కాగా ఆయన ప్రస్తుతం నిమ్స్‌లో యూరాలజీ విభాగం సీనియర్ ప్రొఫెసర్, విభాగాధిపతిగా అత్యున్నత సేవలు అందిస్తున్నారు. డైరెక్టర్‌గా ఆయన పదవీ కాలం మూడు సంవత్సరాల పాటు కొనసాగనుంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు అధికారిక ఉత్తర్వులు (జీ.ఓ. 179) జారీ చేశారు.
- Advertisement -
