Thursday, June 4, 2026
Homeఆదిలాబాద్Awareness | ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా 3K నడక పోటీలు

Awareness | ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా 3K నడక పోటీలు

  • మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో 3K నడక పోటీలు నిర్వహించారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా, ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గవర్నమెంట్ హైస్కూల్ నుంచి జలాల్ బంకు వరకు నిర్వహించిన ఈ నడక పోటీల్లో విద్యార్థులు, యువత, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడటంలో సైకిల్ వినియోగం, నడక వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ ప్రజలకు అవగాహన కల్పించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News