Wednesday, June 3, 2026
Homeభక్తిGoddess Lakshmi | ప్రతి శుక్రవారం ఇలా చేయండి..

Goddess Lakshmi | ప్రతి శుక్రవారం ఇలా చేయండి..

  • లక్ష్మీదేవి మీ ఇంట్లో సిరులు కురిపిస్తుంది..
  • కొన్ని నియమ నిబంధనలు పాటించాలి..
  • వాస్తుశాస్త్ర నిపుణులు వెల్లడించిన వివరాలు..

శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడినది. అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరూ అమ్మవారిని పూజిస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, శుక్ర వారం రోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా కొన్ని నియమ నిబంధనలు పాటించాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. శుక్ర వారం లక్ష్మీ వారం. ఈ రోజు ఎవరు అయితే లక్ష్మీదేవిని నిష్టగా భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి డబ్బుకు కొదవే ఉండదు అంటారు. అందుకే చాలా మంది శుక్రవారం రోజున చాలా నిష్టగా ఉంటూ, అమ్మవారికి పూజలు చేస్తారు.

అయితే ఈ రోజున ఒక పని చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందంట. అంతే కాకుండా ఇల్లు మొత్తం డబ్బుతో నిండిపోతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. కాగా, అసలు ఈ రోజు చేయాల్సిన పని ఏమిటంటే? ఎవరు అయితే శుక్రవారం అమ్మవారిని భక్తిగా పూజించి, ఇండి ప్రధాన ద్వారాంలో ఈ శాన్యం మూలలో నెయ్యి దీపం వెలిగిస్తారో వారికి డబ్బుకు కొదవ ఉండదు. అంతే కాకుండా ఆ ఇంటి కుటుంబ సభ్యులు చాలా ఆనందంగా, ఉన్నతంగా ఉంటారంట.

- Advertisement -

ప్రతి శుక్రవారం సాయంత్రం, లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి , తామర పువ్వును సమర్పించాలంట. అంతే కాకుండా, ఆ తర్వాత ఓం శ్రీం మహాలక్ష్మియి నమ: అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం వలన ఇంటిలో ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయని చెబుతున్నారు పండితులు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News