- నిరుద్యోగులకు శుభవార్త..
- వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు..
తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదిరిపోయే తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం మూడు వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా 290 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు TGPSC సెక్రటరీ ఎం. హరిత ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇవే..:
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) – ఆర్ అండ్ బి శాఖ నోటిఫికేషన్, మొత్తం ఖాళీలు: 222, రోడ్లు, భవనాల శాఖలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – ఆర్ అండ్ బి శాఖ నోటిఫికేషన్, మొత్తం ఖాళీలు: 49, ఇవి కూడా రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని ఉద్యోగాలే. అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ నోటిఫికేషన్, మొత్తం ఖాళీలు: 19 తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు జులై 1, 2026 నాటికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే 44 ఏళ్లకు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
