Sunday, May 31, 2026
Homeబిజినెస్Smartphone | తగ్గిపోయిన స్మార్ట్ ఫోన్ విక్రయాలు..

Smartphone | తగ్గిపోయిన స్మార్ట్ ఫోన్ విక్రయాలు..

  • రూపాయి పతనంతో పెరిగిన భారం..
  • ధరలు పెంచిన సంస్థలకు షాక్..

దేశవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల విక్రయాలకు ధరల పెంపు సెగ గట్టిగానే తాకనున్నది. రూపాయి పతనంతో మొబైల్‌ తయారీ సంస్థలపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ధరలు పెంచిన సంస్థలకు అమ్మకాల రూపంలో షాక్‌ తగలబోతున్నది. వచ్చే పండుగ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు 30 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉన్నదని నివేదిక వెల్లడించింది. జూలై నుంచి డిసెంబర్‌ మధ్యకాలంలో ధరలు మరోసారి పెరిగితే వార్షికంగా స్మార్ట్‌ఫోన్‌ సేల్స్‌ భారీగా పడిపోనున్నాయని త్రైకిన్‌ టెక్నాలజీ, టెకేర్‌ సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించాయి. దేశవ్యాప్తంగా 6 వేల మంది యాక్టివ్‌ మొబైల్‌ కొనుగోలుదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది.

ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 48 మంది వచ్చే ఆరు నెలల్లో ఫోన్‌ కొనుగోలు నిర్ణయాన్ని వాయిదావేసుకుంటున్నట్టు చెప్పారు. కానీ, ఆరు శాతం మంది తమ వద్ద ఉన్న ఫోన్‌ను ఎక్సేంజ్‌ ఇచ్చి ఇతర స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉన్నదన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలు భవిష్యత్తులోనూ కొనసాగితే వచ్చే ఆరు నెలల్లో స్మార్ట్‌ఫోన్ల డిమాండ్‌ 11-12 కోట్లకు పడిపోనున్నట్టు తెలిపింది. రూ.20 వేల లోపు ధర కలిగిన స్మార్ట్‌ఫోన్ల ధరలు సరాసరిగా 8 శాతం నుంచి 12 శాతం వరకు పెరిగాయి. ధరల పెరుగుదలే అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని టెకేర్‌ ఫౌండర్‌ ఫైజల్‌ కవూసా తెలిపారు. గడిచిన ఏడాదికాలంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువు ఐదు శాతం పడిపోయింది. సర్వేలో పాల్గొన్న వారిలో ఆరు శాతం మంది సెకండ్‌ హ్యాండ్‌ మొబైళ్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News