- తెలుగులో ఆనంద్.. ఇంగ్లిష్‌లో శివ నాగేశ్వర్..
- ఫలితాలు విడుదల చేసిన అధికారులు..
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన డీఈఈసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ నెల 21న ఆన్‌లైన్‌లో నిర్వహించిన పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. తెలుగు మీడియంలో 82.37%, ఇంగ్లిష్ మీడియంలో 88.69%, ఉర్దూ మీడియంలో 42.31% చొప్పున విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. తెలుగు మీడియంలో 76 మార్కులు సాధించి బీ ఆనంద్ స్టేట్ టాపర్‌గా నిలిచారు.
ఇంగ్లిష్ మీడియంలో 83 మార్కులతో జవ్వాజి శివ నాగేశ్వర్, ఉర్దూ మీడియంలో 66 మార్కులతో డానిష్ అహ్మద్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. ఫలితాల విడుదలతో సీట్ల భర్తీ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు డీఈఈసెట్ కన్వీనర్ జీ రమేశ్ తెలిపారు. జూన్ 2 నుంచి 5 వరకు రాష్ట్రంలోని 10 డైట్ కాలేజీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. వెబ్ ఆప్షన్లు జూన్ 6 నుంచి 8 వరకు ఎంచుకోవచ్చని తెలిపారు.
