- నటి శాంతి రావు.
శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటైన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన – 2026 ను నటి, భామా కలాపం ఫేమ్ శాంతి రావు ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె ఇక్కడి హాలు లో కొలువుదీరిన చేనేత కారులు వస్త్రోత్పత్తులను ఆమె తిలకిస్తూ, చేనేత కారులతో వాటి తయారీ విధానం, ప్రత్యేకత తెలుసుకుంటూ కలవడిగా తిరిగారు.
చేనేత ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలెదని, నేటి తరం యువత కూడా హ్యాండ్ లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారని శాంతి రావు అన్నారు. నిర్వాహకులు జయేష్ గుప్తా* మాట్లాడుతూ జూన్ 4వ తేది వరకు కొనసాగుతున్న ప్రదర్శన లో దేశం లోని 14 రాష్ట్రాల నుండి చేనేత కారులు , చేతి పని బృందాలు తమ సిల్క్ హ్యాండ్ లూమ్ చీరలు, డ్రెస్ మెటిరియల్ వంటి 74 వేల రకాల వస్త్రో ఉత్పత్తులను అందుబాటులొ ఉంచారని వివరించారు.
