Thursday, May 28, 2026
Homeస్పోర్ట్స్Chess | సంచలనం సృష్టించిన ప్రజ్ఞానంద..

Chess | సంచలనం సృష్టించిన ప్రజ్ఞానంద..

  • కార్లసన్ పై అద్భుత విజయం..
  • మూడు ఫుల్ పాయింట్స్ ప్రజ్ఞానంద ఖాతాలో..

భార‌తీయ గ్రాండ్‌మాస్ట‌ర్ ఆర్ ప్ర‌జ్ఞానంద సంచ‌ల‌నం సృష్టించాడు. ప్ర‌పంచ నెంబ‌ర్ వ‌న్ ప్లేయ‌ర్ మాగ్న‌స్ కార్ల‌స‌న్‌పై అద్భుత విజ‌యం సాధించారు. నార్వే చెస్ టోర్నమెంట్‌లో స్వంత‌గ‌డ్డ‌పై కార్ల‌స‌న్‌ను ప్ర‌జ్ఞానంద ఓడించాడు. దీంతో మూడు పుల్ పాయింట్లను అత‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇక వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ డీ గుకేశ్ మాత్రం మ‌రో ఓట‌మిని మూట‌క‌ట్టుకున్నాడు. నార్వేలో కార్ల‌స‌న్ అజేయ‌యాత్ర‌కు ప్ర‌జ్ఞానంద మ‌రోసారి బ్రేక్ వేశారు. ఏడు సార్లు చాంపియ‌న్ అయిన కార్ల‌స్‌న్‌ను ఆయ‌న స్వంత దేశంలోనే మ‌ళ్లీ ఓడించారు. చెస్ చ‌రిత్ర‌లో ఇదో ఘ‌న‌మైన రికార్డుగా భావిస్తున్నారు. గ‌త ఏడాది కూడా ఇక్క‌డే కార్ల‌స‌న్‌పై ప్ర‌జ్ఞానంద విక్ట‌రీ కొట్టాడు.

ఇటీవ‌ల రొమేనియాలోని బుచారెస్ట్‌లో జ‌రిగిన సూప‌ర్‌బెట్ చెస్ క్లాసిక్ టోర్నీలో ప్ర‌జ్ఞానంద విజ‌యం సాధించారు. అయితే ఆ కాన్ఫిడెన్స్‌తోనే తాజాగా నార్వే చెస్ టోర్నీలో అత‌ను అడుగుపెట్టాడు. ప్ర‌స్తుతం కార్ల‌స‌న్ కేవ‌లం 1.5 పాయింట్ల‌తో పోరాడుతున్నారు. నార్వే చెస్‌లో క్లాసిక్ విభాగంలో రెండోసారి ప్ర‌జ్ఞానంద గెలుపొందాడు. డీ గుకేశ్‌పై విజ‌యం సాధించిన ఫిరౌజా ప్ర‌స్తుతం టోర్నీలో టాప్ ప్లేస్‌లో దూసుకెళ్తున్నాడు. అత‌ను క్లాసిక్ గేమ్‌లో కీల‌క‌మైన 1.5 పాయింట్లు సాధించి మొత్తం 7.5 పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో ఉన్నారు. ఇవాళ ఫోర్త్ రౌండ్‌లో గుకేశ్‌, కార్ల‌స‌న్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ది. ఈ మ్యాచ్‌పైనే అంద‌రి దృష్టి నెల‌కొన్న‌ది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News