వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని అన్నారం దర్గా చెరువులో అక్రమార్కులు పర్మిషన్ పేరు చెప్పి… నిబంధనలు తుంగలో తొక్కి.. యదేచ్చగా అక్రమ మట్టి దందా కొనసాగిస్తున్నారు. గురువారం దర్గా చెరువులో జాతరను తలపించేలా అనుమతికి మించి ట్రాక్టర్లలో మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. కండ్ల ముందు ఇంత జరుగుతున్న.. స్థానికులు ఆరోపిస్తున్న… వివిధ శాఖల అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బక్రీద్ పండుగ సెలవు దినాన్ని చూసుకొని అక్రమార్కులు అక్రమ మట్టి దందా కొనసాగిస్తున్నారని, ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అక్రమ మట్టి తరలింపును అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


- Advertisement -
