- కఠినంగా వచ్చిన పేపర్ – 1.
- గతంతో పోలిస్తే తేలిగ్గా వచ్చిన పేపర్ – 2.
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష -2026 పేపర్-1 అత్యంత కఠినంగా వచ్చింది. మూడు నాలుగేండ్లతో పోలిస్తే అత్యంత క్లిష్టంగా ఉన్నదని అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని వివిధ కేంద్రాల్లో పరీక్ష రాసిన అభ్యర్థులకు కఠిన ప్రశ్నలు ఇవ్వడంతో ఇబ్బందులు ఎదురొన్నారు. జనరల్ స్టడీస్ పేపర్‌లో వివిధ విభాగాల నుంచి ప్రశ్నలు వచ్చినప్పటికీ, కరెంట్ అఫైర్స్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా పాలన(గవర్నెన్స్) సంబంధిత ప్రశ్నలను కేస్ స్టడీ రూపంలో అడగడం వల్ల అవి చాలా పొడవుగా ఉండి, సమయాన్ని ఎకువగా తీసుకున్నాయని అభ్యర్థులు వాపోయారు. సాధారణ ప్రజల జీవితాలపై ప్రభావం చూపే అంశాలపై కూడా ప్రశ్నలు ఎకువగా వచ్చాయని పేరొన్నారు.
పేపర్-1లో మొత్తం 100 ప్రశ్నలు ఉండగా.. వాటిలో 27 ప్రశ్నలు కరెంట్ అఫైర్స్, 19 చరిత్ర, సంస్కృతి, 12 భారత రాజ్యాంగం, పాలన, 11 పర్యావరణం, జీవావరణ శాస్త్రం, 10 ఆర్థిక, సామాజిక అభివృద్ధి, 8 సాధారణ విజ్ఞానం, 7 సాధారణ జ్ఞానం, 6 భూగోళ శాస్త్రం నుంచి వచ్చాయి. ఈసారి ప్రశ్నల ధోరణి కోచింగ్ సెంటర్లకు పరిమితమైన సిద్ధతతో సరిపోదని, ప్రామాణిక వనరుల నుంచి కరెంట్ అఫైర్స్‌ను నిరంతరం అధ్యయనం చేసినవారికి మాత్రమే ప్రయోజనం చేకూరేలా ప్రశ్నలు రూపొందించారని కోచింగ్ నిపుణులు అభిప్రాయపడ్డారు.
