- ఆదాయం 9,10,636/-
చిన్న చింత కుంట మండలం అమ్మాపూర్ గ్రామంలో గల శ్రీ కురుమూర్తి దేవస్థానంకు చెందిన హుండీని ప్రతి నెల అమావాస్య ఐన 4 రోజు లెక్కించడం ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు హుండీ లెక్కింపు నిర్వహించగా 9,10,636/- ఆదాయం వచ్చినట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బత్తుల బాలరాజు,ఈవో మాధనేశ్వర్ రెడ్డి తెలిపారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో లెక్కింపు జరిగింది. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు,ఆలయ సిబ్బంది,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
