Wednesday, May 20, 2026
Homeఆరోగ్యంPrediabetes | ప్రీడయాబెటిస్ కు చెక్..

Prediabetes | ప్రీడయాబెటిస్ కు చెక్..

  • విటమిన్ డీ తో అరికట్టవచ్చు..
  • అధ్యయనంలో తేలిన విషయం..

ప్ర‌స్తుత కాలంలో భారతదేశంలో ప్రీడయాబెటిస్ సమస్య వేగంగా పెరుగుతోంది. ఐసీఎంఆర్-ఇండియాబ్ అధ్యయనం ప్రకారం దేశ జనాభాలో సుమారు 15.3 శాతం మంది ప్రీడయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఇది దాదాపు 13.6 కోట్ల మందికి సమానం. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ పరిస్థితి టైప్-2 డయాబెటిస్‌గా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిక మోతాదులో విటమిన్-డి సప్లిమెంట్లు కొంతమందిలో డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయ‌ని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధనను అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించారు. అధ్యయన ఫలితాలు జామా నెట్‌వర్క్ ఓపెన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News