Monday, May 18, 2026
Homeఆదిలాబాద్ASHA Workers | ప్రభుత్వం ఆశ వర్కర్ లను ఆదుకోవాలి

ASHA Workers | ప్రభుత్వం ఆశ వర్కర్ లను ఆదుకోవాలి

  • ఆశా వర్కర్లకు ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి
  • ఆశాలకు ఫిక్స్ డ్ వేతనం 18వేలు చెల్లించాలి
  • సీఐటీయు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సతీమణి సురేఖ మేడం గారికి వినతిపత్రం అందచేశారు
  • దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా కార్యదర్శి

ఆశా వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కరించాలని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే సతీమణి సురేఖ కి ఆశా వర్కర్ల సమస్యలపై వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఆశాల వర్కర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. ఆశా వర్కర్లు గత ఇరవై సంవత్సరాల నుండి పేద ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్నారనీ వీరంతా మహిళలు.

బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే అత్యధికులున్నారనీ నేటికి వీరికి ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు .కనీసం గ్యారెంటీ ఫిక్సిడ్ వేతనం కూడా ఇప్పటివరకు ప్రభుత్వం నిర్ణయం చేయలేదు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు 15 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేశారనీ గుర్తు చేశారు. గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందనీ అనంతరం వచ్చిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని తెలియజేశారు.

- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటింది. ఈ కాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందనీ కానీ నేటికి వేతనాలు పెంచకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.50 లక్షల ఇన్సూరెన్స్, 50వేల మట్టి ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర హామీలు ఇచ్చినా, ఇంకా అమలు చేయటం లేదనీ పి.ఆర్.సి. ఎరియర్స్, లెప్రసీ, పల్సపోలియో, ఎలక్షన్ డ్యూటీ డబ్బులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయను వెంటనే వాటిని విడుదల చేయాలన్నారు.

కావున ఆశ వర్కర్ల సమస్యలు పరిశీలించి, ఆశా వర్కర్ల డిమాండ్లను పరిష్కరించుటకు ప్రభుత్వం తో చర్చించి ఆశా వర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంకె రవి సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు, శోభ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, సువర్ణ ఆశా జిల్లా కమిటీ సభ్యురాలు, సీఐటీయూ నాయకులు కస్తూరి చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News