Monday, May 18, 2026
Homeఆదిలాబాద్Protest | ధరలు పెంచినందుకు నిరసన

Protest | ధరలు పెంచినందుకు నిరసన

పెట్రోల్ , డీజిల్, గ్యాస్ ధరల పెంపు పై కేంద్ర ప్రభుత్వం పై సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఆగ్రహం. కళ్ళకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్. కేంద్రంలోని బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచినందుకు

కేంద్రంలోని ఐబీ చౌరస్తా, అంబేద్కర్ విగ్రహం ఆవరణలో మంచిర్యాల జిల్లా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్ , డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పని చేస్తూ మూలిగే నక్క పైన తాటి పండు పడ్డా చందంగా పేద , మధ్యతరగతి ప్రజల పై పన్నుల భారం మోపుతుందని కేంద్ర ప్రభుత్వం పై ఆగ్రహం వెలుబుచ్చారు. పెట్రోల్ , డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయని పేర్కొనరు.

- Advertisement -

పచ్చిమ ఆసియా లో యుద్ధం కారణంగా నే ధరలు పెంచాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వం చెప్పడం బాధాకరం అన్నారు . యుద్ధ నివారణకు చర్యలు తీసుకోవడం మానేసి , ధరలు పెంచడం పట్టి చూస్తే మధ్య తరగతి ప్రజల నడ్డి విరచడమే అని కేంద్ర పై విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు ఆవేదన వెలుబుచ్చారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక అధ్యక్షుడు, బీసీ సంఘాల నాయకుడు గజెల్లి వెంకటయ్య , ఉపాధ్యక్షులు భీమ్ సేన్ , కార్యదర్శి సతీష్ , నాయకులు భిక్షపతి, అశోక్ , రాజేశం , లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News