Saturday, May 16, 2026
Homeస్పోర్ట్స్Love | లవ్ లో పడ్డ ఆర్.సి.బీ. బ్యాట్స్ మెన్ దేవదత్..

Love | లవ్ లో పడ్డ ఆర్.సి.బీ. బ్యాట్స్ మెన్ దేవదత్..

  • సినీ స్టార్ షెహనాజ్ తో డేటింగ్..
  • ఈ రూమర్లపై స్పందించని క్రికెటర్..

బాలీవుడ్ న‌టి షెహ‌నాజ్ గిల్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఐపీఎల్‌లో ఆర్సీబీ ఎక్క‌డ ఆడినా.. ఈ క్యూటీ అక్క‌డ క‌నిపిస్తోంది. అయితే ఆర్సీబీ బ్యాట‌ర్ దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్‌తో ఫిల్మ్ స్టార్ షెహ‌నాల్ గిల్ డేటింగ్ చేస్తున్న‌ట్లు రూమ‌ర్లు వ‌స్తున్నాయి. ఓ సంద‌ర్భంలో ఆమె మాట్లాడుతూ ఆర్సీబీలో ఇద్ద‌రు ప్లేయ‌ర్లు అంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని అన్నారు. ఫెవ‌రేట్ ప్లేయ‌ర్ ఎవ‌ర‌ని ఆమెను అడ‌గ్గా.. ఐ ల‌వ్ విరాట్‌, ఐ ల‌వ్ దేవ‌ద‌త్ అని ఆమె తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు మాత్రం షెహ‌నాజ్ గిల్ కానీ, దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ కానీ డేటింగ్ రూమ‌ర్ల‌పై స్పందించ‌లేదు. కొన్ని రోజుల క్రితం షెహ‌నాజ్ చేసిన ఓ పోస్టు అంద‌ర్నీలో డౌట్స్ పెంచింది.

దిల్ ఆర్సీబీ మే హై అని ఆమె పేర్కొన్న‌ది. దీంతో ఆమె క్రికెట‌ర్‌తో డేటింగ్ చేస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. చాలా వ‌ర‌కు ఆర్సీబీ మ్యాచ్‌ల‌కు ఆమె హాజ‌ర‌వుతోంది. స్టాండ్స్‌లో ఆర్సీబీ అభిమానుల‌ను ఉత్తేజ ప‌రిచింది. ఆర్సీబీ జెర్సీ వేసుకుని ఆ జ‌ట్టుపై త‌న అభిమానాన్ని ఆమె చాటుకున్న‌ది. గురువారం త‌న ఇన్‌స్టాలో షెహ‌నాజ్ ఓ కొత్త వీడియో పోస్టు చేసింది. మ‌జా ఆ గ‌యా అని రాసిందామె. బెంగుళూరుకు చీర్స్ చెబుతూ క‌నిపించింది. బిగ్ బాస్ 13వ సీజ‌న్‌లో ఆమె పాపుల‌రైంది. కిసి కా భాయ్ కిసి కా జాన్ చిత్రంలో న‌టించింది. ఇక్ కుడి పంజాబీ చిత్రంలో కూడా ఆమె న‌టించింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News