Saturday, May 16, 2026
Homeనల్లగొండSeized | పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత..

Seized | పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత..

  • 431 కిలోల స్వాధీనం, ఇద్దరు అరెస్ట్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద రాచకొండ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ (RNPS) బృందం మరియు చౌటుప్పల్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేపట్టగా TS07GM 4617 నంబర్‌తో (నకిలీ నంబర్ ప్లేట్) వెళ్తున్న మహీంద్రా XUV వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

వాహనాన్ని తనిఖీ చేసే సమయంలో అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తుల్లో ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేయగా సుమారు 431 కిలోల గంజాయి లభ్యమైంది. ఇందులో 5 కిలోల చొప్పున 83 ప్యాకెట్లు, 2 కిలోల చొప్పున 8 ప్యాకెట్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

పోలీసుల విచారణలో నిందితులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని తెలిసింది. రాజమండ్రి ప్రాంతంలో రాకేష్ అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయిని సేకరించి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు వారు ఒప్పుకున్నారని సమాచారం.

అదుపులోకి తీసుకున్న నిందితులు:

సలీమ్ (34), డ్రైవర్, లిషాడి గ్రామం, మీరట్ జిల్లా, ఉత్తరప్రదేశ్.

అమన్ (22), డ్రైవర్, లిషాడి గ్రామం, మీరట్ జిల్లా, ఉత్తరప్రదేశ్.

ఈ కేసులో అమీరుద్దీన్ మరియు ఫిరోజ్ అనే మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. చౌటుప్పల్ పోలీసుల సమన్వయంతో ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News