Thursday, May 14, 2026
Homeరంగారెడ్డిMembership | సభ్యత్వ నమోదు, కమిటీ ఏర్పాట్లపై దృష్టి

Membership | సభ్యత్వ నమోదు, కమిటీ ఏర్పాట్లపై దృష్టి

  • మల్కాజ్‌గిరిలో బీఆర్ఎస్ మీటింగ్‌లు

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని 183 డివిజన్‌లో విస్తృత స్థాయి సమావేశాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బద్దం పరుశురాం రెడ్డి, జేఏసీ వెంకన్న , ఖలీల్ తదితర నాయకులు పాల్గొని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి సంస్థాగత ఎన్నికలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. డివిజన్ స్థాయి కమిటీలను సమర్థవంతంగా ఏర్పాటు చేసి పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టి ప్రతి ఇంటికి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎస్ ఐ ఆర్ ( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ) ప్రక్రియలో ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండి ఓటర్ల హక్కులను కాపాడాలని సూచించారు.

- Advertisement -

సమావేశానికి హాజరైన నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను గౌరవిస్తూ తగిన నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మల్కాజ్‌గిరి అభివృద్ధి కోసం ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకువస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలపర్చేందుకు కార్యకర్తలందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ రుసుములను ప్రకటించారు. సాధారణ సభ్యత్వం రూ.10 కాగా, క్రియాశీలక సభ్యత్వం రూ.50గా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES

Latest News