- ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సత్వర న్యాయం జరుగుతుందనే నమ్మకం కల్పించాలి
- మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్*
బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి,సత్వర న్యాయం జరుగుతుందనే నమ్మకం కల్పించాలని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ పేర్కొన్నారు.
మంగళవారం మంచిర్యాల జోన్ పరిధిలోని సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న డీసీపీ గారికి అధికారులు మొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించిన డీసీపీ, స్టేషన్ రిసెప్షన్, సీసీటీఎన్‌ఎస్ సిబ్బంది, ఇతర పోలీస్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే స్టేషన్ నిర్వహణకు సంబంధించిన రికార్డులు, రౌడీ షీటర్లు, అనుమానితుల వివరాలు, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసుల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది సమస్యలను కూడా డీసీపీ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్, వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ విజిబుల్ పోలీసింగ్ చేపట్టాలని సూచించారు. ప్రతి కానిస్టేబుల్‌కు కేటాయించిన కాలనీలు, గ్రామాలను సందర్శించి ప్రజలు, యువతతో మాట్లాడి శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకోవాలన్నారు.అలాగే ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చూడాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచాలని తెలిపారు.కళాశాలలు, పాఠశాలల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని డీసీపీ అధికారులు, సిబ్బందికి ఆదేశించారు. ఈ తనిఖీల్లో మంచిర్యాల రూరల్ సీఐ రవీందర్, ఎస్‌ఐ ప్రశాంత్ పాల్గొన్నారు.
