- “నా ఇల్లు నాకు కావాలి” అంటూ రోదించిన దానమ్మ
జవహర్ నగర్ బాలాజీ నగర్ పరిధి సుమారు 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న సొంత గూడు కళ్ల ముందే కబ్జాకు గురవడంతో ఓ వృద్ధురాలు తనకు న్యాయం చేయాలని రోడ్డుకెక్కింది. “నా ఇల్లు నాకు కావాలి” అంటూ బాధితురాలు బూదల దానమ్మ కాప్రా ఎమ్మార్వో కార్యాలయం ముందు మీడియా తో ఆవేదన వ్యక్తం చేశారు.
బాలాజీ నగర్ శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన దానమ్మ గత నాలుగు దశాబ్దాలుగా అక్కడే నివసిస్తున్నారు. అయితే, స్థానిక రాజకీయ పలుకుబడి ఉన్న బిఆర్ఎస్ (గతంలో టిఆర్ఎస్) నాయకులు ఆమె స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసినట్లు బాధితురాలు ఆరోపించారు.తాను నివసిస్తున్న ఇంటిని బలవంతంగా ఆక్రమించుకొని తనను నిరాశ్రయురాలిని చేశారని ఆమెకన్నీటిపర్యంతమయ్యరు తనకు జరుగుతున్న అన్యాయంపై బాధితురాలు మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ని కలిసి మొరపెట్టుకున్నారు. దానమ్మ ఆవేదనను విన్న ఎంపీ వెంటనే స్పందించారు.
ఎంపీ ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కబ్జాదారులపై మే 5,నా కేసు నమోదైంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని ఎంపీ సంబంధిత ఎమ్మార్వో పోలీసు అధికారులతో మాట్లాడారు. ఎమ్మార్వో కార్యాలయం ముందు దానమ్మ చేస్తున్న నిరసన స్థానికంగా చర్చనీయాంశమైంది. 40 ఏళ్లుగా ఉన్న ఇంటిని రాజకీయ నాయకులు కబ్జా చేయడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ జోక్యంతో కేసు నమోదైన నేపథ్యంలో, అధికారులు తక్షణమే స్పందించి ఆమె స్థలాన్ని ఆమెకు అప్పగించాలని దానమ్మ డిమాండ్ చేస్తున్నారు. “రాజకీయ అండదండలతో పేదల ఇళ్లను ఆక్రమిస్తే ఊరుకునేది లేదు. దానమ్మకు తక్షణమే న్యాయం జరగాలి.
రేపన లక్ష్మణ్ జవహర్ నగర్ టిడిపి అధ్యక్షులు!
