- పలు మలుపులు తిరుగుతున్న తమిళనాడు పాలిటిక్స్..
తమిళనాడు రాజకీయాలు పలు మలుపులు తిరుగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న విజయ్ నేతృత్వంలోని టీవీకేకు భంగపాట్లు ఎదురవుతున్నాయి. ఏఎంఎంకే ఎమ్మెల్యే తమకు మద్దతు ఇచ్చినట్లు టీవీకే వీడియో రిలీజ్ చేసింది. అయితే అది ఫోర్జరీ లేఖ అంటూ ఏఎంఎంకే పార్టీ ఫిర్యాదు చేసింది. టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) నుంచి ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ తమకు మద్దతు ఇచ్చినట్లు టీవీకే పేర్కొంది. లేఖపై ఆయన సంతకం చేస్తున్న వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి దినకరన్ ఆమోదంతోనే టీవీకేకు తాను మద్దతు ఇస్తున్నట్లు రామరాజ్ అందులో పేర్కొన్నారు. ఈ లేఖను గవర్నర్‌కు కూడా టీవీకే సమర్పించినట్లు సమాచారం.
- Advertisement -
