Friday, May 8, 2026
HomeజాతీయంTVK | టీవీకే విజయ్ కు నిరాశ..

TVK | టీవీకే విజయ్ కు నిరాశ..

  • అవసరమైన పూర్తి మెజారిటీ లేదన్న గవర్నర్..

గవర్నర్ ఆర్లేకర్‌ను మరోసారి కలిసిన టీవీకే అధినేత విజయ్‌కు నిరాశే ఎదురైంది.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజార్టీ లేదంటూ లోక్ భవన్ వర్గాలు స్పష్టం చేశాయి.. చెన్నైలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు తాత్కాలికంగా నిలిపివేశారు.. 118 మ్యాజిక్ ఫిగర్‌కు దూరంగా ఉన్న టీవీకే.. మద్దతు ఎమ్మెల్యేల జాబితా గవర్నర్‌కు విజయ సమర్పించారు.. “పూర్తి సంఖ్యాబలం చూపిన తర్వాతే ఆహ్వానం” అని గవర్నర్ సూచించినట్లు సమాచారం అందుతోంది.. కాగా “విజయ్‌ను తప్ప మరెవ్వరినీ ప్రభుత్వ ఏర్పాటుకు పిలవను” అని గవర్నర్ హామీ ఇచ్చినట్లు టీవీకే వర్గాలు వెల్లడించాయి.. “మెజార్టీపై నేను సంతృప్తి చెందాలి” అంటూ గవర్నర్ ఆర్లేకర్ వ్యాఖ్యానించారు..

రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి.. విజయ్ ప్రభుత్వం ఏర్పాటుచేసే వరకు వేచిచూస్తాం” అని డీఎంకే అధినేత స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు.. ఇదిలా ఉంటే.. అన్నాడీఎంకేలో కుదుపు.. విజయ్‌కు అనుకూలంగా పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.. ఉప ముఖ్యమంత్రి పదవి, ఐదు మంత్రి పదవుల డిమాండ్‌పై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది..

- Advertisement -

అప్రమత్తమైన ఈపీఎస్.. ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని రిసార్ట్‌కు తరలించారు.. గవర్నర్ స్పందన తర్వాత న్యాయనిపుణులతో విజయ్ కీలక సమావేశం జరిపాడు.. హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసే దిశగా టీవీకే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం..

- Advertisement -
RELATED ARTICLES

Latest News