- అత్యవసర విచారణకోసం వెకేషన్ బెంచ్ ఏర్పాటు..
మే 8 నుంచి తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు.. కాగా అత్యవసర విచారణ కోసం వెకేషన్ బెంచ్ లు ఏర్పాటు చేశారు.. ఇక జూన్ 8 నుంచి పూర్తిస్థాయి విచారణ పునఃప్రారంభం అవుతాయి.. సెలవుల సమయంలో మే 12, 19, 26, జూన్ 2న అత్యవసర పిటిషన్లు దాఖలకు అవకాశం కలిపించారు.. వీటిపై మే 14, 21, 28, జూన్ 4న వెకేషన్ బెంచ్ లు విచారణ చేపడతాయి.. ఈ నాలుగు రోజుల్లో ఓ డివిజన్ బెంచ్, ఓ సింగిల్ బెంచ్ విధులు నిర్వహిస్తాయి.. హెబియస్ కార్పస్, ముందస్తు బెయిల్, అత్యవసర అంశాలపై దాఖలయ్యే పిటిషన్ల పై వెకేషన్ బెంచ్ లు విచారణ చేయనున్నట్లు కోర్టు అధికారులు తెలిపారు..
- Advertisement -
