వేసవి సెలవులను నిరాకరిస్తూ ఇంటర్మీడియట్ సమ్మర్ క్లాసుల నిర్వహణ
- నారాయణ జూనియర్ కాలేజీ యాజామాన్యం నిర్వాకం
- సాక్షాత్తు సీఎం నిర్వహిస్తున్న విద్యాశాఖలో లోపాలు
- విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరుగుతుందన్న ఆందోళన
- క్లాసులు వెంటనే నిలిపివేయాలని తల్లిదండ్రుల డిమాండ్
- యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలన్న విద్యార్థి సంఘాలు
- కాలేజీ యాజమాన్యంతో కుమ్మక్కు అయిన కొందరు అధికారులు
నారాయణ జూని యర్ కాలేజీ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ఇంటర్మీడియట్ తరగతులను (సమ్మర్ క్లాసులు) నిర్వహిస్తోందని ఆరోపణలు వెల్లువెతుతున్నాయి. ఈ చర్యలపై విద్యార్థి సంఘాలు, విద్యారంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలవులు నిరాకరిస్తూ కార్పొరేట్ విద్యాసంస్థలు రహస్యం గా క్లాసులు నిర్వహిస్తున్నాయి.. ఇది విద్యార్థుల ఆరోగ్యం, మాన సిక స్థితిపై ప్రభావం చూపుతుంది.
అక్రమంగా నిర్వహి స్తున్న సమ్మర్ క్లాసులను వెంటనే నిలిపివేయాలని విద్యార్ధి సం ఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘించిన నారాయణ కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు కోరుతు న్నాయి. విద్యార్థుల భవిష్యత్తు పెట్టుబడిగా వ్యాపారమే పరమా వధిగా భావిస్తున్న నారాయణ యాజమాన్యం మరోసారి నిబం ధనలు ఉల్లంఘించింది. విద్యార్థుల భవిష్యత్తును., ప్రభుత్వ నిబం ధనలను కాలరాస్తూ అక్రమంగా వేసవి సెలవుల్లో ఇంటర్మీడియట్ క్లాసులు నిర్వహించడం విస్మయానికి గురిచేస్తోంది.
విద్యార్థులపై మానసిక ఒత్తిడిని పెంచుతూ. విద్యాశాఖ మార్గ దర్శకాలను తుంగలో తొక్కి నారాయణ విద్య సంస్థ సాగిస్తున్న ఈ విద్య దందాపై సర్వత్రా విమర్శలు నిరసనలు వ్యక్తమవుతు న్నాయి. ఇంత జరుగుతున్న ఇంటర్ మీడియట్ బోర్డు విద్యాశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేంటని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి సంచలనాలలో అంచనాలకు మించి అవినీతికి కేంద్రబింధువై ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్న నారాయణ విద్య సంస్థల యాజమాన్యం మరోసారి నిబంధనలను ఉల్లంఘించింది..

వేసవి సెలవుల్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్లు/ క్లాసులు నిర్వహించడం/ప్రారంభించడం నియమాలకు విరుద్ధం.. బోర్డు మార్గదర్శకాలను ఉల్లంఘించడం తీవ్ర నేరంగా పరిగణించాలి. అనైతిక చర్యలతో ముందస్తు అడ్మిషన్లతో, ముందస్తు క్లాసులతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుంది. విద్యా వ్యవస్థ నైతికతను దెబ్బతీస్తూ వారి వ్యాపార ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడటం జరుగుతోంది..
వెంటనే విచారణ చేపట్టాలి నారాయణ కాలేజీపై కఠిన చర్యలు తీసుకోవాలి.. ఇలాంటి చర్యలు మరెక్కడా జరగకుండా పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేయాలి.. విద్యార్థుల హక్కులు, వారి భవిష్యత్తు రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. అవసరమైతే, చట్టం ప్రకారం న్యాయపరమైన చర్యలు కూడా తీసుకోబడతాయి. విద్యార్థుల హక్కులు, విద్యా ప్రమాణాలను కాపాడడం బాధ్యతగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేశాయి.. విద్యాశాఖ ఉన్నతాధికారులు, నారాయణ విద్యాసంస్థలు చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. వారిపై తక్షణమే చర్యలకు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు..
