Wednesday, May 6, 2026
Homeఆదిలాబాద్MCPI(U) | పంట కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వీడనాడాలి

MCPI(U) | పంట కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వీడనాడాలి

  • లక్షెట్టిపేట మండలంలో చనిపోయిన రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
  • చనిపోయిన ఒక్కొక్క రైతు కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం చెల్లించాలి*
  • చనిపోయిన రైతు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలి
  • ఎం సి పి ఐ యు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ డిమాండ్

బెల్లంపల్లి కొత్త బస్టాండ్ లోని ఎం సి పి ఐయూ పార్టీ కార్యాలయంలో మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ పత్రిక సమావేశం నిర్వహించారు వెంకటేష్ మాట్లాడుతూ పంట కొనుగోళ్లలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపు ధోరణి వెంటనే విడనాడాలని పంట కొనుగోలును తోరిగతిన పూర్తి చేయాలని పంట కొనుగోలును పూర్తి చేస్తే ఇలాంటి దారుణం జరిగేది కాదని పంట కొనుగోలు చేయకపోవడం వల్ల అకాల వర్షం రావడం వల్ల పంటను కాపాడుకుందాం అని వెళ్ళిన మంచిర్యాల జిల్లా లక్షట్ పేట మండలంలో రైతులు చనిపోవడం అనేది చాలా బాధాకరం.

ఈ ప్రమాదంలో చనిపోయిన గండారపు వెంకటేష్, తనుగుల అభిరామ్, విలికీల లచ్చన్న, తనుగుల నాగరాజుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఒక్కో కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇప్పించాలని, వాటితో పాటు చనిపోయిన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని, కావున ఇప్పటికైనా కూడా పంట కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం లేనియెడల మంచిర్యాల జిల్లాలోని ఉన్న రైతులందరినీ కలుపుకొని జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాం,ఈ కార్యక్రమంలో, దుర్గం లక్ష్మి, రాజ్ కుమార్, సబ్బని రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News