Tuesday, May 5, 2026
Homeఅంతర్జాతీయంCanada | కీలక నిర్ణయం తీసుకున్న కెనెడా..

Canada | కీలక నిర్ణయం తీసుకున్న కెనెడా..

  • ఖలిస్థాన్ వేర్పాటువాదులు చాలా ప్రమాదకరం..
  • తీవ్రవాద ఎజెండాను ప్రచారం చేయనున్న కెనెడా..

ఖలిస్థాన్‌ వేర్పాటువాదుల విషయంలో కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. ఖలిస్థాన్‌ వేర్పాటువాదులు తమ దేశ జాతీయ భద్రతకు ముప్పుగా కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ ప్రకటించింది. తమ హింసాత్మక తీవ్రవాద ఎజెండాను కెనడాలో ప్రచారం చేయడానికి వేర్పాటువాదుల బృందం వివిధ సంస్థలను వాడుకుంటున్నదని పేర్కొన్నది. ఆదివారం ఈ మేరకు ‘2025 పబ్లిక్‌ రిపోర్ట్‌’ను విడుదల చేసింది.

కెనడా కేంద్రంగా ఖలిస్థాన్‌ వేర్పాటువాదుల హింసాత్మక కార్యకలాపాలు ఈ దేశానికి, కెనడా ప్రయోజనాలకు ముప్పుగా నివేదిక పేర్కొన్నది. ‘కెనడా పౌరులతో సంబంధాలు కొనసాగిస్తున్న సీబీకేఈ.. తీవ్రవాద ఎజెండా ప్రచారానికి వారిని ఉపయోగించుకుంటున్నది. అమాయక పౌరుల నుంచి నిధులు సేకరించి, వాటిని హింసాత్మక కార్యకలాపాల వైపు మళ్లిస్తున్నది’ అని నివేదిక తెలిపింది. నివేదికను కెనడా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. జస్టిన్‌ ట్రూడో తర్వాత కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మార్క్‌ కార్నీ.. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News