Saturday, April 25, 2026
Homeహైదరాబాద్‌Traffic | తార్నాకలో కురిసిన అకాల వర్షం భారీగా ట్రాఫిక్ జామ్

Traffic | తార్నాకలో కురిసిన అకాల వర్షం భారీగా ట్రాఫిక్ జామ్

  • మెట్టుగూడ–హబ్సిగూడ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్
  • మూడు గంటలకు పైగా వాహనదారుల నరక ప్రయాణం
  • ఓయూ, చిలకలగూడ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం–పరిస్థితి క్రమంగా అదుపులోకి

గత కొద్ది రోజులుగా మండుతున్న ఎండలు,వడగాలులతో ఉక్కిరిబిక్కిరి అయిన నగర ప్రజలకు శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం కొంత ఉపశమనం కలిగించింది.అయితే,ఈ వర్షం నగర రవాణా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసి,మెట్టుగూడ నుంచి తార్నాక, హబ్సిగూడ వరకు భారీ ట్రాఫిక్ సమస్యకు దారితీసింది.సుమారు 20 రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ,సాయంత్రం ఒక్కసారిగా మొదలైన చినుకులు క్రమంగా భారీ వర్షంగా మారాయి.వర్షం కారణంగా రోడ్లపై నీరు నిల్వవడం,వాహనాల వేగం తగ్గిపోవడం వంటి కారణాలతో మెట్టుగూడ జంక్షన్ నుంచి తార్నాక ఫ్లైఓవర్ మీదుగా హబ్సిగూడ వరకు జాతీయ రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్థంభించింది.

వర్షం నుండి తప్పించుకునేందుకు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తార్నాక ఫ్లైఓవర్ కింద వాహనాలను ఆపడంతో ట్రాఫిక్ మరింత తీవ్రరూపం దాల్చింది.ఫలితంగా,సుమారు రెండు గంటలకు పైగా వాహనదారులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించారు.అత్యవసర సేవలైన అంబులెన్స్‌లు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.ఇకపోతే,వర్షం తగ్గిన వెంటనే ఓయూ,చిలకలగూడ ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు.సైరన్‌లతో వాహనదారులను చాకచక్యంగా క్రమబద్ధీకరిస్తూ ట్రాఫిక్‌ను క్రమంగా సద్దుమణిగేలా చేశారు.

- Advertisement -

అయినప్పటికీ సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమైన ట్రాఫిక్ జామ్ రాత్రి 8 గంటల వరకు కొనసాగడం గమనార్హం.ఈ ఘటనతో అకాల వర్షాలు నగర రవాణాపై చూపే ప్రభావం మరోసారి వెలుగులోకి వచ్చింది.భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News