Friday, April 24, 2026
Homeహైదరాబాద్‌Needle Therapy | నీడిల్ థెరపితో మోకాళ్ళ నొప్పులు మాయం

Needle Therapy | నీడిల్ థెరపితో మోకాళ్ళ నొప్పులు మాయం

  • డాక్టర్ పోసాని పార్ధసారధి

ఎలాంటి శస్త్ర చికిత్సలు, వైద్య పరీక్షలు లేకుండా కేవలం నీడిల్ థెరపితో ఒకే సిటింగ్ లో మోకాళ్ళ నొప్పులను, తగ్గిస్తున్నామని, అరిగిన మోకాళ్ళను సైతం నయం చేస్తున్నట్లు డాక్టర్ పోసాని పెయిన్ క్లినిక్ వైద్య నిపుణులు డాక్టర్ పార్ధసారధి పోసాని తెలిపారు. మోకాళ్ళ నొప్పులతో కార్పొరేట్ ఆసుపత్రులకు వెళితే వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి శస్త్ర చికిత్సలు చేసి లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారని, శస్త్ర చికిత్స అవసరం లేకుండా నొప్పి తగ్గించే మార్గం నీడిల్ థెరపితో మాత్రమే సాధ్యం అని ఆయన సవాల్ విసిరారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయా వివరాలు వెల్లడించారు.

నీడిల్ థెరపి చేయించుకుని కొద్దిపాటి ఆహార మార్పులు చేసుకుని తిరిగి ఆరోగ్యంగా జీవనం కొనసాగించవచ్చని డాక్టర్ పార్ధసారధి పోసాని తెలిపారు. అమెరికాలో సర్జన్ చేసి 30 ఏళ్ళు వివిధ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించిన తరువాత అనేక పరిశోధనల తరువాత కెనడా, చైనా, జపాన్ తదితర దేశాలు తిరిగిన తరువాత తనకు నీడిల్ థెరపి పట్ల ఆసక్తి పెరిగిందని, తన ప్రయోగాలు విజయవంతం అయ్యాక హైదరాబాద్ వచ్చి కూకట్ పల్లి జలవాయు విహార్ లో క్లినిక్ ప్రారంభించినట్లు చెప్పారు.

- Advertisement -

కండరాలను శక్తివంతంగా చిరు వ్యాయామంతో మార్చుకుని జఠరాగ్ని శక్తి పెంపొందించుకునే ఆహారం తీసుకుని కఫం తగ్గించుకుంటే అనారోగ్యం దరి చేరదని డాక్టర్ పోసాని పార్ధసారధి తెలిపారు. తెల్ల బియ్యం అన్నం, జంక్ ఫుడ్, వైట్ షుగర్ స్వీట్స్, కూల్ డ్రింక్స్ పూర్తిగా మరచిపోవాలని ఆయన సూచించారు. ఆహారంలో చేదు ఉండేలా, ఆకుకూరలు ఎక్కువ ఉండేలా చూసుకోవాలన్నారు. గోరు వెచ్చని అల్లం పెప్పర్ వడగట్టిన నీటిని పడుకునే ముందు తీసుకుంటే ఆసుపత్రులకు వెళ్లే సమస్య ఉండదని ఆయన అన్నారు.

మోకాళ్ళ గుజ్జు తగ్గిందని వైద్యులు చెప్పే మాటలు నమ్మవద్దని, శస్త్ర చికిత్సలు చేయించుకోవద్దని, ఒకే సిటింగ్ లో నీడిల్ థెరపి ద్వారా నయం చేస్తున్నట్లు డాక్టర్ పార్ధసారధి పోసాని వివరించారు. అమెరికా, కెనడా నుంచి కూడా తన దగ్గరకు వచ్చిన మహా మొండి కేసులను కూడా నయం చేసినట్లు ఆయన తెలిపారు. మోకాళ్ళ నొప్పులు, వెన్నెముక నొప్పులతో పాటు ఏ పెయిన్ అయినా నీడిల్ థెరపి ద్వారా నయం చేయవచ్చని చెప్పారు. ఆసక్తిగలవారు 99892 49359 ఫోన్ నెంబర్ లో అనుమతి తీసుకుని ఉచిత సలహాలు పొందవచ్చని ఆయన కోరారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు డాక్టర్ మహ్మద్ రఫీ అభినందించి డాక్టర్ పార్ధసారధి పోసానిని సత్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News