Friday, April 24, 2026
Homeవరంగల్‌Narsampet | నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం..

Narsampet | నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం..

అక్రమంగా డ్రైవర్, కండక్టర్ ను నర్సంపేట డిఎం రిక్రూట్ చేస్తుంది అంటూ మనోవేదన… సమస్యలు పరిష్కరించకుంటే వీధిన పడతామని మనస్థాపo చెందిన శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని నిప్పు పట్టించుకున్న డ్రైవర్

నర్సంపేట ఆర్టీసీ డిపో పరిధిలో విధులు నిర్వహిస్తున్న శంకర్ గౌడ్ అను ఆర్టిసి డ్రైవర్ నర్సంపేట ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. దీంతో శంకర్ గౌడ్ వేసుకున్న దుస్తులతో పాటు శరీరం ఖాళీ పోతుండడంతో అందుబాటులో ఉన్న కార్మికులు మంటలను ఆర్పి వేశారు. అనంతరం వరంగల్ ఎంజిఎంకు ఆస్పత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు తోటి కార్మికులు చెబుతున్నారు.

- Advertisement -

నర్సంపేట డిఎం అత్యుత్సాహం

రెండు రోజులుగా సమ్మెలో పాల్గొంటున్న ఆర్టీసీ కార్మికులకు చుక్కలు చూపించేందుకు నర్సంపేట ఆర్టీసీ డిఎం అర్ధరాత్రి కొంతమంది డ్రైవర్లను కండక్టర్లను అక్రమంగా రిక్రూట్ చేసుకొని బస్సులు నడపడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఉదయం ఆర్టీసీ బస్టాండ్కు చేరుకున్న కార్మికులు నర్సంపేట డిపో నుండి బయటకు వెళ్తున్న బస్సులను చూసి అర్ధరాత్రి జరిగిన తతంగం గమనించి మనోవేదనకు గురయ్యారు.

దీంతో మనం ఓపక్క సమ్మె చేస్తున్న క్రమంలో డిఎం అత్యుత్సాహం వల్ల డ్రైవింగ్ నాణ్యతలేని డ్రైవర్లను రిక్రూట్ చేసుకోవడం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని కార్మికులు మనోవేదన చెందుతున్న తరుణంలో అక్కడే ఉన్న డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోల్ బాటిల్ లో పెట్రోల్ నింపుకొని వచ్చి ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఒక పక్క ప్రభుత్వాలు చర్చలకు పిలవడం లేదని నిప్పుల్లో కాలిపోతున్న కార్మికుడు శంకర్ గౌడ్ ఆవేదన చెందాడు.

నర్సంపేటలో రాస్తారోకో

నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న తోటి కార్మికులందరు ఏకమై బస్టాండ్ ఎదురుంగా ఉన్న ప్రధాన గేటు వద్ద సుమారు గంటన్నర సేపు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డి ఎం డౌన్ డౌన్ అంటూ ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. దీంతో ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ ఘటనస్థలికి విచ్చేసి కార్మికులను బుజ్జగించారు.

వివిధ పార్టీల మద్దతు

నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడంతో వివిధ పార్టీల రాజకీయ నాయకులు కార్మికుల సమ్మెకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేరుకున్న శంకర్ గౌడ్ ను పరామర్శించి ధైర్యం చెప్పి సమస్యల సాధన కోసం నిరంతరం కార్మికుల వెంట ఉంటామని స్పష్టం చేశారు.

అదేవిధంగా బిజెపి నాయకులు డాక్టర్ రానా ప్రతాపరెడ్డి నర్సంపేట ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపి సమ్మెలో పాల్గొన్నారు. అదేవిధంగా ఎం సి పి ఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీలో నాయకులు నర్సంపేట ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలిచి ప్రభుత్వంపై ఆగ్రహ జ్వాలలు రేకెత్తించారు. వెంటనే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News