Tuesday, April 21, 2026
Homeమెదక్‌Support | అధైర్యపడకండి.. అండగా నే నున్నా.

Support | అధైర్యపడకండి.. అండగా నే నున్నా.

  • యువనేత చిలుకూరి మహేందర్ రెడ్డి

అధైర్య పడకండి అండగా మీకు నే నుంటాని యువ నాయకులు చిలుకూరి మహేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జగదేవపూర్ మండలంలోని దౌలాపూర్ గ్రామానికి చెందిన కొండాపూర్ ఉమారాణి గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మరణంతో ముగ్గురు చిన్నారులు తల్లిని కోల్పోయి అనాథలయ్యారు. తండ్రి ఉన్నప్పటికీ, ఆయనకు చెవులు వినిపించని పరిస్థితి ఉండటంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

ఏమి చేయాలో ఎలా పిల్లలను పోషించాలి స్థితిలో పడిపోవడంతో విషయం తెలుసుకున్న గ్రామ నాయకులు మహేందర్ రెడ్డి స్పందించారు. బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి వారి దైన్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. సోమవారం ఆ కుటుంబానికి నిత్యవసర సరుకులను అందించి నే నున్నానంటూ భరోసాను కల్పించారు . ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలోనే అసలైన తృప్తి ఉందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News