Tuesday, April 21, 2026
Homeరంగారెడ్డిInauguration | చిన్నారుల విద్యా ప్రస్థానంలో ప్రీ స్కూల్ కీలకం..

Inauguration | చిన్నారుల విద్యా ప్రస్థానంలో ప్రీ స్కూల్ కీలకం..

  • కేవీ రెడ్డి నగర్ లో కిడ్స్ జీ స్కూల్ ప్రారంభించిన సాయిపేట శ్రీనివాస్..

చిన్నారుల విద్యా ప్రస్థానంలో ప్రీ స్కూల్ కీలక పాత్ర పోషిస్తోందని గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్ తెలిపారు. సోమవారం కేవీ రెడ్డి నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన కిడ్స్ జీ ప్రీ స్కూల్ ను సాయిపేట శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయస్సులోనే పిల్లల మేధస్సు, భావోద్వేగాలు, సామాజిక నైపుణ్యాలు వేగంగా అభివృద్ధి చెందే సమయంలో ప్రీ స్కూల్ ద్వారా సరైన మార్గదర్శనం లభిస్తుందన్నారు. ప్రీ స్కూల్ విద్య పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, పాఠశాల విద్యకు సులభంగా అలవాటు పడేలా చేసి పిల్లలలో సామర్థ్యం, ఆలోచనా శక్తి కూడా పెంచుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు హేమంత్, విజయేందర్ రెడ్డి, అశోక్, నాయకులు దొడ్ల నాగరాజు, సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News