Wednesday, April 22, 2026
Homeస్పోర్ట్స్Rashid Khan | స్పెషల్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్న రషీద్..

Rashid Khan | స్పెషల్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్న రషీద్..

  • రషీద్ ఖాన్ ఫ్రొం స్ట్రీట్స్ టు స్టార్ డమ్ అనే బుక్ రాసిన రషీద్..

ఆఫ్ఘ‌నిస్తాన్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్.. క్రికెట్ ప్ర‌పంచంలో ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నాడు. టీ20 క్రికెట్ లీగ్‌లో అత‌నో స్పెష‌ల్‌ ప్లేయ‌ర్‌గా మారాడు. ఆఫ్ఘ‌నిస్తాన్‌తో పాటు ఐపీఎల్‌లోనూ స్టార్ అట్రాక్ష‌న్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. అయితే ఆ లెగ్ స్పిన్న‌ర్ ఇటీవ‌ల ఓ బుక్ రాశాడు. ర‌షీద్ ఖాన్ ఫ్ర‌మ్ స్ట్రీట్స్ టు స్టార్‌డ‌మ్ అనే బుక్‌లో త‌న అనుభ‌వాలు పంచుకున్నాడ‌త‌ను. 2023 ఐపీఎల్ సీజ‌న్ స‌మ‌యంలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌ను ఆ బుక్‌లో అత‌ను గుర్తు చేశాడు. ఓ టీమ్ అధికారితో జ‌రిగిన సంభాష‌ణ గురించి చెప్పాడు.

భార‌త క్రికెట్‌కు చెందిన ఓ వ్య‌క్తితో ప‌రిచ‌యం అయ్యింద‌ని, అత‌నితో మాట్లాడుతున్న స‌మ‌యంలో త‌న‌కు ఓ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు ర‌షీద్ ఖాన్ తెలిపాడు. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ప‌రిస్థితులు బాగా లేవ‌ని, భార‌త్‌కు వ‌చ్చి ఇక్క‌డే ఉండిపోవాల‌ని ఆ వ్య‌క్తి త‌న‌ను కోరిన‌ట్లు ర‌షీద్ బుక్‌లో రాశాడు. భార‌త పౌర‌స‌త్వాన్ని ఇప్పిస్తామ‌ని, ఇక్క‌డ ఉండి, క్రికెట్ ఆడుకోవ‌చ్చు అన్నార‌ని పేర్కొన్నారు. కానీ ఆ అధికారి ఇచ్చిన ఆఫ‌ర్‌తో ఆశ్చ‌ర్య‌పోయిన‌ట్లు ర‌షీద్ ఖాన్ తెలిపాడు. ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియ‌లేద‌ని, ఓ న‌వ్వు న‌వ్వి ఆ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించిన‌ట్లు చెప్పాడు. త‌న దేశం ఆఫ్ఘ‌నిస్తాన్ త‌ర‌పున ఆడుతున్న‌ట్లు చెప్పాన‌న‌న్నాడు.

- Advertisement -

ఇండియా ఒక్క‌టే కాదు, ఆస్ట్రేలియా నుంచి కూడా త‌న‌కు సిటిజ‌న్‌షిప్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు ర‌షీద్ పేర్కొన్నాడు. ఒక‌వేళ తాను త‌న దేశానికి ఆడ‌లేక‌పోతే, అప్పుడు ఇక ఏ దేశం త‌ర‌పున కూడా తాను ఆడ‌లేన్న విష‌యాన్ని వారికి చెప్పిన‌ట్లు ర‌షీద్ త‌న బుక్‌లో రాశాడు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News