- న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో దిల్ ప్రీత్ ఫిక్సింగ్ చేశాడని అనుమానాలు..
ఇటీవల వరల్డ్‌కప్‌లో ఆడిన కెనడా జట్టు టీ20 కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వాపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలికి చెందిన అవినీతి నిరోధక యూనిట్ ఆ ఆరోపణలపై దర్యాప్తు చేపడుతున్నది. టీ20 వరల్డ్‌కప్ సమయంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్‌ప్రీత్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పంజాబ్‌లోని బాటాలాలో జన్మించాడు దిల్‌ప్రీత్. అతని వయసు 24 ఏళ్లు. వరల్డ్‌కప్‌లో అతని ఆటతీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కెనడా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌పై ఏసీయూ దర్యాప్తు చేపడుతోంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన ఆ మ్యాచ్ జరిగింది. న్యూజిలాండ్ 174 రన్స్ చేజింగ్ చేస్తున్న సమయంలో 35-2 స్కోరు వద్ద అకస్మాత్తుగా దిల్‌ప్రీత్ బజ్వా బౌలింగ్ చేశాడు. అతను తన తొలి ఓవర్‌లో నోబ్‌లు, వైడ్‌లు వేశాడు. మొత్తం 15 రన్స్ ఇచ్చాడు. కానీ అనూహ్యంగా అతను బౌలింగ్ చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మ్యాచ్ కీలక దశలో ఉన్నప్పుడు బజ్వా బౌలింగ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఏసీయూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన బౌలర్లు.. కావాలని నోబ్ లేదా వైడ్ వేసే అవకాశాలు ఉంటాయి. ఆ కోణంలో బజ్వాపై విచారణ జరగనున్నది.
