- కొరుకుడు పడని ఇరాన్ వ్యవహారం..
- సన్మార్ హెరాల్డ్ ట్యాంకర్ కాప్టెన్ ఆవేదన..
హార్ముజ్ జలసంధిని దాటేందుకు శనివారం ప్రయత్నించిన రెండు భారతీయ ట్యాంకర్లపై ఇరాన్ దళాలు కాల్పులు జరిపాయి. ఈ సందర్భంగా ఒక భారతీయ ట్యాంకర్ కెప్టెన్ ఇరాన్ నేవీతో జరిపిన సంభాషణ ఆడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది. ‘హార్ముజ్‌లో వెళ్లేందుకు మీరు అనుమతి ఇచ్చారు, ఇప్పుడు కాల్పులు జరుపుతున్నారు’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
‘సన్మార్ హెరాల్డ్’ అనే ట్యాంకర్ కెప్టెన్ ఇరాన్ నేవీతో ఇలా మాట్లాడారు. ‘సెపా నేవీ! సెపా నేవీ! ఇది ‘సన్మార్ హెరాల్డ్’ అనే మోటార్ ట్యాంకర్. వెళ్ళడానికి మీరు నాకు అనుమతి ఇచ్చారు. మీ జాబితాలో నా పేరు రెండవది. మీరు నాకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. మీరు ఇప్పుడు కాల్పులు జరుపుతున్నారు. నన్ను వెనక్కి తిరగనివ్వండి’ అని ఆయన అన్నారు.
- Advertisement -
