Saturday, April 18, 2026
Homeమహబూబ్‌నగర్‌Arrive Alive | ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించిన మంత్రులు

Arrive Alive | ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించిన మంత్రులు

  • పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి
  • హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణం చేయాలని సూచించారు

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా లో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రవాణా,బి.సి.సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,రాష్ట్ర పశు సంవర్ధక,, పాడి అభివృద్ధి,మత్స్య ,క్రీడలు,యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పంచవటి విద్యాలయం లో మానవ హారం లో పాల్గొని అరైవ్ అలైవ్ కార్యక్రమం లో భాగంగా చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ను ప్రారంభించిన మంత్రులు పొన్నం ప్రభాకర్,వాకిటి శ్రీహరి మాట్లాడారు.

చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ లో ట్రాఫిక్ రూల్స్ సిగ్నల్స్ ,జీబ్రా క్రాసింగ్ ,స్కూల్ హాస్పిటల్ జోన్,యూటర్న్ తదితర వాటిపై విద్యార్థులు అవగాహన కల్పించారు.. పంచవతీ విద్యాలయం రోడ్ సేఫ్టీ అవేర్నెస్ లో భాగంగా హెల్త్ క్యాంప్, ఐ క్యాంప్ ను ప్రారంభించారు.. సిపిఆర్ పై అవగాహన కల్పించారు.. రోడ్డు నిబంధనలు పాటిస్తాం ప్రమాదాలను తగ్గిస్తాం అని విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించిన మంత్రులు..

- Advertisement -

తొలుత మహబూబ్ నగర్ ఎం.వి.ఎస్ డిగ్రీ కాలేజీ నుండి పంచ వటి విద్యాలయం వరకు హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ వాహనదారులతో కలిసి బైక్ ర్యాలీ చేసిన మంత్రులు రోడ్డు ప్రమాదాలు జరిగితే కుటుంబాలు పడే ఇబ్బందులు ఇంటి పెద్దను కోల్పోతే పిల్లలు పడే కష్టాల పై నృత్యాల ద్వారా వివరించిన విద్యార్థులురోడ్డు నిబంధనలు పాటిస్తామని ,రోడ్డు ప్రమాదాలు జరగకుండా తమ కర్తవ్యాలు నిర్వహిస్తామని విద్యార్థులతో రోడ్ సేఫ్టీ ప్రతిజ్ఞ చేయించిన మంత్రి పొన్నం ప్రభాకర్..

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి,ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ, మేయర్ జి. మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ ,జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా,ఎస్.పి.డి జానకి,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ రెడ్డి,రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితా మధుసూదన్ రెడ్డి,జిల్లా ఒలింపిక్ అసో సియేషన్ అధ్యక్షులు వెంకటేష్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్,డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డా. ఎన్. వాణీ,డి.టి.సి రఘు, ఇతర ముఖ్య నేతలు, అధికారులు

- Advertisement -
RELATED ARTICLES

Latest News