Friday, April 17, 2026
Homeఅంతర్జాతీయంWarning | ఇజ్రాయిల్ కు వార్నింగ్ ఇచ్చిన లెబనాన్..

Warning | ఇజ్రాయిల్ కు వార్నింగ్ ఇచ్చిన లెబనాన్..

  • ఒప్పొందాన్ని ఉల్లంగిస్తే తిరిగి దాడులు చేస్తాం..
  • మా వేళ్ళు ఇంకా ట్రిగ్గర్ మీదే ఉన్నాయని హెచ్చరిక..

ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య పది రోజులపాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ ఇజ్రాయెల్‌కు హెచ్చరిక జారీ చేసింది. ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తే, తిరిగి దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. తమ వేళ్లు ఇంకా ట్రిగ్గర్ మీదే ఉన్నాయని చెప్పింది. ఇరాన్-అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా, ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కూడా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. పది రోజులపాటు కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి.

ఇప్పటికే ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని కూడా అమెరికా వెల్లడించింది. ఇజ్రాయెల్-లెబనాన్ దేశాల నేతల మధ్య దశాబ్దాల తర్వాత తొలి సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించాడు. లెబనాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా కూడా కాల్పుల విరమణ పాటిస్తూ, ఈ పది రోజులు ప్రశాంతంగా ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పాడు. దీనివల్ల ఎలాంటి చంపుకోవడాలు, దాడులు ఉండవని, శాంతి ఏర్పడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

- Advertisement -

ఇదే సమయంలో హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ స్పందిస్తూ.. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాటించకపోతే, తాము కూడా తిరిగి దాడులు చేస్తామని హెచ్చరించింది. ఈ ఒప్పందం నేపథ్యంలో లెబనాన్‌లోని ప్రజలు తమ సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్తున్నారు. ఇంతకాలం యుద్ధం నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల ప్రజలు తమ ప్రాంతాల్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News